నేనేం ఎయిడ్స్‌డే శుభాకాంక్షలు చెప్పలేదు  

Nara Lokesh Comments On Jagan Mohan Reddy About Aids Day - Telugu Aids Day Wishes Says In Naralokesh, Nara Lokesh, , Social Media Viral In Naralokesh

ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నిన్న ఎయిడ్స్‌ డే సందర్బంగా ఎయిడ్స్‌ రోగులకు శుభాకాంక్షలు చెప్పాడంటూ కొందరు సోషల్‌ మీడియాలో కొన్ని స్క్రీన్‌ షాట్స్‌ పోస్ట్‌ చేశారు.సోషల్‌ మీడియాలో అవి కాస్త వైరల్‌ అయ్యాయి.

Nara Lokesh Comments On Jagan Mohan Reddy About Aids Day

ఎయిడ్స్‌ డే శుభాకాంక్షలు ఏంటీ అంటూ చాలా మంది తీవ్ర విమర్శలు చేయడంతో పాటు మరీ ఇంత పప్పు అనుకోలేదు అంటూ ఎద్దేవ చేస్తున్నారు.ఇలాంటి సమయంలో తన పేరుపై వస్తున్న విమర్శలను నారా లోకేష్‌ చాలా సీరియస్‌గా కొట్టి పారేశాడు.

సోషల్‌ మీడియాలో నేను ఎయిడ్స్‌ డే శుభాకాంక్షలు చెప్పినట్లుగా వస్తున్న వార్తలు, జరుగుతున్న ప్రచారం ఫేక్‌ అన్నాడు.ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్.

జగన్ గారు పేటీఎమ్ లో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు.జగన్ గారు చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్ కి పనిపెట్టారు.

అంటూ ట్వీట్‌ చేశాడు.నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Lokesh Comments On Jagan Mohan Reddy About Aids Day-nara Lokesh,social Media Viral In Naralokesh Related....