బాబు కొడుకు పదవి కోసం కంగారు పడుతున్నాడు

మండలి రద్దుతో తన కొడుకు ఎమ్మెల్సీ పదవి ఎక్కడ పోతుందో అని.ఆ పదవి పోతే లోకేష్‌ రాజకీయ భవితవ్యం ఏంటో అని చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

 Nara Lokesh Chandrababu Ysrcp-TeluguStop.com

మంగళగిరి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత లోకేష్‌ ప్రత్యక్ష రాజకీయాల్లో నెగ్గుకు రావడం అసాధ్యం అని బాబు అనుకుంటున్నాడు.అందుకే ఆయన ఎప్పటికి ఎమ్మెల్సీగానే ఉండాలని కోరుకుంటున్నారు.

ఇప్పుడు జగన్‌ నిర్ణయంతో మండలి రద్దు అయితే లోకేష్‌ రాజకీయంగా నిరుద్యోగి అవుతాడు.అందుకే చంద్రబాబు నాయుడు మండలి రద్దుపై నానా యాగీ చేస్తున్నాడు.

గతంలో మండలి అనేది డబ్బు దండగ అంటూ.అసలు అవసరం లేదు అంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తిగా యూ టర్న్‌ తీసుకున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు.

మొత్తానికి చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకులు సంధిస్తున్న ప్రశ్నలతో తెలుగు దేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పలేక బిత్తర పోతున్నారు.చంద్రబాబు నాయుడు గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నాయకుల నోళ్లకు తాళం వేసినట్లుగా చేశాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube