లోకేష్ లో బాబు కోరుకుంది ఇదే ?  

Chandrababu happy on Lokesh issue,Nara lokesh, Chandrababu naidu, TDP Leaders, Political Plan, Chandrababu Politics, YCP - Telugu Chandrababu Happy On Lokesh Issue, Chandrababu Naidu, Chandrababu Politics, Nara Lokesh, Political Plan, Tdp Leaders, Ycp

టీడీపీ అధినేత చంద్రబాబుకు తీవ్ర అసంతృప్తి ఏదైనా ఉందంటే, అది ఖచ్చితంగా ఆయన తనయుడు నారా లోకేష్ గురించే.తన తరువాత అంతటి స్థాయి లోకేష్ పొందాలనేది చంద్రబాబు తాపత్రయం.

TeluguStop.com - Nara Lokesh Chandrababu Politics

టీడీపీ కి రానున్న రోజుల్లో నేతృత్వం వహించాల్సిన లోకేష్ తన పనితీరు మెరుగు పరుచు కోకుండా, ప్రత్యర్థులకు నిత్యం దొరికి పోతూ, విమర్శల పాలవుతున్న తీరు, చంద్రబాబుకు చాలాకాలంగా బాధను కలిగిస్తోంది.ఒకవైపు తనకు వయస్సు పైబడిపోతుండడం ,  తాను ఎంతో కాలం యాక్టి వ్ గా ఉండలేని పరిస్థితి ఉండడంతో, ఏం చేయాలో తెలియక, పార్టీ లోని సీనియర్ నాయకుల వద్ద బాబు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉండేవారు.

లోకేష్ ఎక్కడ ప్రసంగాలు చేసినా, అది టీడీపీకి క్రెడిట్ తీసుకు రాకపోగా, ప్రత్యర్థులకు వరంగా మారడంతో పాటు, ప్రతి దశలోనూ లోకేష్ అభాసుపాలు అవుతూ వచ్చేవారు.దీంతో లోకేష్ పర్యటన అంటేనే నియోజకవర్గాలలో నేతలు ఆందోళన చెందే పరిస్థితి ఉండేది.
 అదేపనిగా వైసిపి నాయకులు లోకేష్ వ్యవహారశైలిని విమర్శిస్తూ, రాజకీయ అసమర్థుడు అనే ముద్ర వేయడం వంటి వ్యవహారాలతో చాలాకాలంగా లోకేష్ సైతం ఏపీకి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.కరోనా ప్రభావం విజృంభిస్తున్న సమయంలోనూ హైదరాబాద్ నుంచి ఏపీకి అడుగుపెట్టేందుకు ఆయన సాహసం చేయలేదు.

TeluguStop.com - లోకేష్ లో బాబు కోరుకుంది ఇదే -Political-Telugu Tollywood Photo Image

దీనిపైన వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు చేసింది.ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా లోకేష్ వ్యవహారాన్ని చూసుకుంటే, ఆయన బాగా మెరుగైనట్టు గా కనిపిస్తున్నారు.

పార్టీలో తన ముద్ర వేసుకుంటూ, జిల్లాల పర్యటనలు చేస్తూ, ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూస్తూ, వారితో మమేకమవుతూ, అన్నిరకాలుగా పై చేయి సాధిస్తూ వస్తుండడంతో, పార్టీ శ్రేణులలోను కాస్త ఊపు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

దీనికి తోడు కొద్ది రోజుల క్రితం నియమించిన పార్టీ కమిటీలలోనూ, లోకేష్ కు అనుకూలంగా ఉండే వారిని నియమించడం వెనుక కూడా చంద్రబాబు రాజకీయ వ్యూహం పని చేసింది.మొత్తంగా చూస్తే లోకేష్ పనితీరు, ఆయన పర్యటనలకు వస్తున్న ఫీడ్ బ్యాక్ తో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపు అయిందట.ఇకపైన లోకేష్ ఇదే విధంగా దూకుడు కొనసాగిస్తే, తెలుగుదేశం పార్టీకి రానున్న రోజుల్లో విజయం ఖాయమని, అలాగే లోకేష్ పనితీరు పై పార్టీ నేతల్లో సందేహాలు సైతం తొలగిపోతాయని, మరింత ఉత్సాహంతో పని చేస్తారని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు.

#Political Plan #TDP Leaders #Nara Lokesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Lokesh Chandrababu Politics Related Telugu News,Photos/Pics,Images..