చిన బాబు పలుకులు ... టీడీపీకి తలనొప్పులు  

Nara Lokesh Another Tongue Mistake In Ap-

మాట మాట్లాడితే చాలు రాజకీయాల్లో నన్ను మించిన సీనియర్ లేడు అంటూ గొప్పలు చెప్పుకుంటాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.కానీ ఆయన కుమారుడు ఐటీ మంత్రి లోకేష్ బాబు కి మాత్రం ఇంకా తండ్రి రాజకీయ బుద్దులు ఇంకా అబ్బలేదు.

అందుకే ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో .ఇంకా తెలుసుకోలేకపోవడమే కాదు మాటలు తడబడుతూ అసలుకే ఎసరు తెస్తూ పార్టీకి తలనొప్పిగా మారాడు.

Nara Lokesh Another Tongue Mistake In Ap-

చంద్రబాబు వయసు మీద పడుతుండడంతో ఇక పార్టీని పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది కానీ ఆయన ఫెర్ఫామెన్స్ చూస్తే అంతంత మాత్రంగా ఉంది.

లోకేష్ లూజ్ టంగ్ కారణంగా టీడీపీకి మాయని మచ్చతో పాటు ప్రత్యర్థి పార్టీలకు అదే అదనపు బలంగా మారింది.లోకేష్ ఎప్పుడు ఎక్కడ ఏ మీటింగ్ లో మాట్లాడినా… తడబాటు పడుతూ తెలుగు ను కూనీ చేస్తుండడం ఆ వీడియో క్లిపింగ్స్ పట్టుకుని ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటున్నాయి.లోకేష్ కు తెలుగు భాషపై పట్టు పెంచి మీటింగ్స్ లో అదరగొట్టే స్పీచ్ లు ఇప్పించాలని నెల నెల లక్షల రూపాయలు జీతం ఇస్తూ.

ఒక టీచర్ ని కూడా బాబు ఏర్పాటు చేసాడు.కానీ ఫలితం మాత్రం కనిపించడంలేదు.అసలు లోకేష్ స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాడు అంటేనే బాబు వెన్నులో వణుకు మొదలవుతోంది.

లోకేష్ అసలు మీటింగ్ లో మాట్లాడుతున్నాడు అంటేనే ఎప్పుడు కామెడీ చేస్తాడా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.అంటే లోకేష్ ని ఎంత లోకువగా చూస్తున్నారో అర్ధం అవుతోంది.తాజాగా జగన్ పై లోకేష్ చేసిన కామెంట్స్ కూడా టీడీపీ పరువు తీశాయి.

జగన్ మోదీ రెడ్డి అని పేరు పెట్టుకుంటే బాగుంటాదని లోకేష్ చేసిన కామెంట్స్‌కు ఎలా స్పందించాలో ప్రజలకు అర్ధం కాలేదు.అక్కడితో లోకేష్ ఆగలేదు భాజాపా అంటే భాజాపా, జగన్ , పవన్ పార్టీ అంటూ మరో జోక్ పేల్చారు.

లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ప్రధాని పేరును జగన్ పక్కన తీసుకొచ్చి పెట్టి జగన్ ఇమేజ్‌ను పెంచుతున్నట్టుగా ఉన్నాడు.

తాజా వార్తలు

Nara Lokesh Another Tongue Mistake In Ap- Related....