చిన్న‌బాబు దూకుడున్నా.. మంత్రాంగం ఫ‌లించేనా..?  

lokesh active and speedy in TDP,but not workout,andhra pradesh,chandra babu naidu,lokesh babu,active in politics,special stratagey,no TDP leaders,rally,shock,TDP brothers - Telugu Active In Politics, Andhra Pradesh, Chandra Babu Naidu, Lokesh, Lokesh Babu, No Tdp Leaders, Rally, Shock, Special Stratagey, Tdp Brothers

టీడీపీలో చిన్న‌బాబు.నారా లోకేష్ దూకుడు పెంచారు.

TeluguStop.com - Nara Lokesh Active And Speedy In Tdp

క‌రోనా నేప‌థ్యంలో చంద్ర‌బాబు నేరుగా క్షేత్ర‌స్థాయికి రాలేక పోతున్న నేపథ్యంలో ఆయ‌న హైద‌రాబాద్‌లోనే ఉండి కార్య‌క్ర‌మాల‌ను న‌డిపిస్తున్నారు.పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల వాయుగుండం ప్ర‌భావంతో భారీ వ‌ర్షాలు కురిసి.వ‌ర‌ద‌ల‌లో చిక్కుకున్న జిల్లాల్లో ప‌ర్య‌టించారు.

TeluguStop.com - చిన్న‌బాబు దూకుడున్నా.. మంత్రాంగం ఫ‌లించేనా..-Political-Telugu Tollywood Photo Image

అక్క‌డి ప‌రిస్థితుల‌ను కూడా నిల‌దీశారు.ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు.

అంతేకాదు, వ‌చ్చే నెల నుంచి ప్ర‌త్య‌క్ష పోరాటాల‌కు కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు చెప్పారు.వ‌ర‌ద‌ల‌తో అల్లాడుతున్న జిల్లాల‌పై ప్ర‌భుత్వానికి క‌నిక‌రం లేకుండా పోయింద‌ని విమ‌ర్శించారు.

అంతా బాగానే ఉంది.చిన్న‌బాబు దూకుడు పెంచారు.అయితే, ఇది ఏమేర‌కు పార్టీకి ప్ర‌యోజనం చేకూరుస్తోంది?  ఏమేర‌కు నేత‌ల‌ను ఐక్యంగా ముందుకు తీసుకువెల్తోంది? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తే.మాత్రం ప్ర‌శ్న‌లు మాత్ర‌మే మిగులుతున్నాయి.

దీనికి కార‌ణం.పెద్ద‌గా స్పంద‌న లేక‌పోవ‌డమే.

క‌రోనా నేప‌థ్యంలో బ‌య‌ట‌కు రాలేక పోతున్నామ‌ని చెబుతున్నా.వాస్త‌వానికి పార్టీలో చిన్న‌బాబుపై అసంతృప్తి ఉంది.

గ‌తంలో ప్ర‌భుత్వం ఉన్న‌ప్సుడు చిన్న‌బాబు బ‌య‌ట‌కు వ‌స్తే.ఆయ‌న వెంట దాదాపు వంద మంది వ‌ర‌కు నేత‌లు ఉండేవారు.

కానీ, ఇప్పుడు ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా క‌నిపించ‌డం లేదు.ఇటీవల గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా ఈ త‌ర‌హా ప‌రిస్తితి క‌నిపించింది.జిల్లా స్థాయి నాయ‌కుడు ప‌ర్య‌టిస్తే.వ‌చ్చే బూమ్ మాత్ర‌మే వ‌చ్చింది.

ఈ ప‌రిణామాల‌తో చిన్న‌బాబు ఒకింత ఆశ్చ‌ర్యం, అస‌హ‌నం కూడా వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.దీంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను త‌గ్గించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని కొందరు అంటుంటే.

నేత‌ల‌ను మ‌రింత‌గా ఉత్సాహ‌ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని అంటున్నారు.

ఇప్పుడున్న స్పంద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఆయ‌న ఉత్సాహంగా ఉన్నార‌ని అంటున్నారు.

అయితే, రాబోయే రోజుల్లో చిన్న‌బాబు పార్టీని ముందుకు న‌డిపించేందుకు ప్ర‌స్తుతం చేస్తున్న ప్ర‌యోగం ఫ‌లించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంటున్నారు.మొత్తానికి ఈ ప‌రిస్థితి ఎటు దారి తీస్తుందో చూడాలి.

#Shock #Lokesh #No TDP Leaders #Andhra Pradesh #TDP Brothers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nara Lokesh Active And Speedy In Tdp Related Telugu News,Photos/Pics,Images..