ఈ ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసా?

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా? బహుశా గుర్తు పట్టె ఉంటారు లెండి.ఎందుకంటే రాజకీయాల్లో అపర చాణక్యుడు కదా! కాదు కాదు వెన్నుపోటు రాజకీయాల్లో అపర చాణక్యుడు అని అంటుంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు.

 Ex Cm Chandrababu Naidu Young Age Photos Viral,nara Chandrababu Naidu, Tdp, Ntr,-TeluguStop.com

రాజకీయాల కోసం మామను దారుణంగా మోసం చేసినట్టు ఇప్పటికి ఎక్కడో ఒకచోట వార్తలు వస్తూనే ఉంటాయ్.ఇంకా గుర్తు రాలేదా? అతనే అండి నారా చంద్రబాబు నాయుడు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో అది.యుక్త వయసులో అయన తీసుకున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.ఆంధ్ర ప్రదేశ్ ని ఎక్కువ కాలం పరిపాలించిన రాజీకీయ నాయడుకు నారా చంద్రబాబు నాయుడు.ఎటువంటి ఆస్తిపాస్తులు లేకుండా కేవలం చదువు, తెలివిని పెట్టుబడి పెట్టి రాజకీయాలలో చాణిక్యుడు అయ్యాడు చంద్రబాబు.

చదువుకునే రోజుల్లో కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆతర్వాత నటవారసుడు ఎన్టీఆర్ కూతురును పెళ్లి చేసుకున్నాడు.మామ తెలుగు దేశం పార్టీ పెట్టినప్పటికి చంద్రబాబు నాయుడు రాలేదు.

కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అధిష్టానం అవకాశం ఇస్తే మామకే వ్యతిరేకంగా పోటీ లో నిలబడుతా అని చెప్పాడు.ఆతర్వాత మెల్లగా తెలుగు దేశంలో పార్టీలో చేరిన అయన ఎన్టీఆర్ నమ్మకాన్ని సొంతం చేసుకొని ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యాడు అని అంటుంటారు.

ఇక అయన ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఎంతో అందంగా తీర్చి దిద్దాడు.చంద్రబాబు రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని, అప్పులపాలు చేశారని కొన్ని ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయ్.

దాదాపు పది సంవత్సరాల పాటు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు.ఆంధ్ర తెలంగాణ విడిన తర్వాత 2014లో నవ్యంధ్రప్రదేశ్ కు చంద్రబాబు తొలి సీఎం అయ్యాడు.ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చడం పక్కన పెట్టి మరోసారి అయన ఆంధ్ర రాజధాని అయిన అమరావతిపైనే సమయమంతా కేటాయించడంతో ప్రజలలో వ్యతిరేకత పుట్టింది.2019లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్ చేతిలో దారుణంగా ఓడిపోయాడు.ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube