బాబు ప్రేక్షకపాత్ర...సోము ప్రతిపక్షపాత్ర...!

2019 ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా తిరిగిన సందర్భాలు చాలా తక్కువ.ఏదో మొదట్లో జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు, తర్వాత అమరావతి కోసం భిక్షాటన చేశారు.

 Chandrababu In Audience Role And Somu In Opposition Role, Chandra Babu, Somu Vee-TeluguStop.com

కానీ కరోనా వచ్చాక మాత్రం బాబు ఏపీ మొహం చూడటమే తక్కువైపోయింది.హైదరాబాద్‌కే పరిమితమైపోయి, అక్కడ నుంచి జూమ్ యాప్ ద్వారా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

లాక్‌డౌన్ ఎత్తేసినా కూడా బాబు ఏపీకి వచ్చి, ప్రజలకు అండగా ఉండటమో, సమస్యలపై పోరాటం చేయడమో, పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు ఒక్కటి చేయడం లేదు.

పోనీ లోకేష్‌ని అయినా పంపించి, ఏపీలో సమర్ధవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా? అంటే అది చేయడం లేదు.కేవలం హైదరాబాద్‌లో ఉంటూ బాబు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారనే వాదనలు వస్తున్నాయి.ఇదే సమయంలో ఏపీలో ఒక్కశాతం కూడా ఓట్లు తెచ్చుకొని బీజేపీ ఓ రేంజ్‌లో దూసుకెళుతుంది.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు.ఎక్కడ ఏ విషయం జరిగినా, సోము అక్కడ ఉంటున్నారు.

ప్రభుత్వం తప్పులని ఎత్తి చూపే కార్యక్రమం చేస్తున్నారు.

Telugu Active, Andhra Pradesh, Chandra Babu, Lokesh, Role, Somu Veera Raju, Tdp

వరదల సమయంలో పలు గ్రామాల్లో పర్యటించారు.ఇటు దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయా చోట్లకు వెళ్ళి నిరసన తెలుపుతున్నారు.తాజాగా  అంతర్వేదిలో రథం దగ్ధమైన విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఛలో అమలాపురం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని పోలీసులు ఆదిలోనే ఆపేశారు గానీ, సోము పోరాటం మాత్రం జనంలోకి వెళ్లింది.

అయితే బీజేపీ ఈ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ దూసుకెళుతుంటే టీడీపీ మాత్రం ప్రేక్షక పాత్ర వహించి అన్నీ చూస్తూ కూర్చుంది.

ఇక ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో టీడీపీ కేడర్ ఎవరు వారి దారి చూసుకునే అవకాశం లేకపోలేదు.ఇప్పటికైనా చంద్రబాబు గానీ, లోకేష్ గానీ ఏపీలోకి వచ్చి యాక్టివ్‌గా తిరగకపోతే టీడీపీ గతి అధోగతి అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube