రావమ్మా కోడలు పిల్ల.. తెలంగాణ టీడీపీ కి కొత్త బాస్

తెలంగాణాలో పూర్తిగా పట్టు కోల్పోయిన టీడీపీకి మళ్ళీ జవసత్వాలు నింపాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్ఠపరిచి చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు సంపాదించాలని చూస్తోంది.

 Nara Brahmani Will Be Big Boss Of Telangana Tdp-TeluguStop.com

ఇప్పటికే పేరున్న నాయకులూ చాలామంది పార్టీని వదిలేసి తమకు అనుకూలంగా ఉన్న పార్టీల్లో చేరిపోయారు.ఈ దశలో తెలంగాణాలో పార్టీ ఉన్న లేనట్టుగానే ఉంది.

మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలంటే సమర్ధవంతమైన నాయకత్వం అవసరం ఎంతయినా ఉంది.

ప్రస్తుతం టీడీపీలో ఓ హాట్ టాఫిక్ నడుస్తోంది.అదేంటంటే చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణికి తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పజెప్పబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం టీ-టీడీపీని కాపాడుకుంటూ వస్తున్న ఎల్.రమణ డిఫెన్స్ గేమ్‌లో బాగా వెనకపడిపోయారు.నేతల కొరత, మోత్కుపల్లి తిరుగుబాటు, అధికార పార్టీ ఆగడాలు ఎదుర్కోలేక టీటీడీపీ సతమతం అవుతోంది.

వీటన్నిటికీ తక్షణ పరిష్కారం గా చంద్రబాబు, తెలంగాణలో కోడల్ని రంగంలో దింపుతారన్న వార్తలు కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి.

అసలే తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి అంటూ అధికార పార్టీ టీడీపీ ఒకటే హడావుడి చేసేస్తోంది.

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తోంది.రాహుల్ గాంధీతో బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలంగాణాలో మరింత పుంజుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.

చంద్రబాబుకు బద్ధ వ్యతిరేకిగా మారిన మోత్కుపల్లిని జనసేన నెత్తికెత్తుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి.తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ రకమైన టీడీపీ వ్యతిరేక వార్తలపైనా పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొని ఉంది.

ఇటువంటి క్లిష్ట సమయంలో బ్రాహ్మణి వంటి వ్యక్తి అయితేనే తన ఛరిష్మాతో పార్టీని గట్టెక్కించొచ్చని బాబు అండ్ కో ఆలోచనగా టీటీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు.వీలైనంత తొందరలోనే తెలంగాణ టీడీపీని ఆమెకు అప్పగించే అవకాశం ఉన్నట్టు వార్తలు బయటకి పొక్కుతూనే ఉన్నాయి.కానీ దీనిపై అధిష్టానం మాత్రం నోరు మెదపడంలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube