అనూహ్యంగా తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న వైఎస్ షర్మిల మరికొద్ది రోజుల్లోనే తమ పార్టీ పేరును ప్రకటించి సంచలనం సృష్టించ బోతున్నారు.షర్మిల పార్టీ ఏర్పాటు వెనుక బలమైన రెడ్డి సామాజిక వర్గం తో పాటు, టిడిపి, కాంగ్రెస్ పార్టీలలో ఉన్న నాయకులు రాజకీయ ప్రత్యామ్నాయ కోరుకోవడం, అటువంటి వారిని తమ పార్టీలో చేర్చుకుని బలమైన రాజకీయ పార్టీగా అవతరించ వచ్చి అనే ఉద్దేశంతో షర్మిల అడుగులు వేస్తున్నారు.
అయితే షర్మిల రాజకీయ అడుగులపై అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు షర్మిలకు పోటీగా టిడిపి జాతీయ అధ్యక్షుడు , చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ని రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కాస్తో కూస్తో ఆదరణ ఉంది.నాయకుల బలమూ ఉన్నా, వారిని ముందుండి నడిపించే నాయకత్వ లోపం ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చతికిలపడింది.
ప్రస్తుతం షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్న తరుణంలో బ్రాహ్మణి కి తెలంగాణ టిడిపి బాధ్యతలు పూర్తిగా అప్పగించి రాజకీయంగా యాక్టివ్ చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చంద్రబాబు లోకేష్ ఇద్దరు ఏపీ రాజకీయాలపైనే పూర్తి గా ఫోకస్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల గురించి పట్టించుకునే అంత తీరిక వారికి లేదు.తెలంగాణ విభజన తర్వాత కూడా తెలంగాణలో టిడిపి బలంగానే ఉన్నా ,చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం అక్కడ బాధ్యతలు మొత్తం రమణ మాత్రమే చూస్తున్నారు.అడపాదడపా మాత్రమే చంద్రబాబు అక్కడి రాజకీయాల గురించి పట్టించుకుంటున్నారు.
అందుకే బ్రాహ్మణి యాక్టివ్ చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కి పునర్వైభవం తీసుకు వచ్చి పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం నింపాలని, అధికారం చేపట్టే అంతటి స్థాయిలో కాకపోయినా, తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీఆర్ఎస్ , బీజేపీ సరసన నిలబడే అంతటి స్థాయిలో బలోపేతం చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

ఇక బ్రాహ్మణి కూడా ఎప్పటి నుంచో రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నారు.అటు నందమూరి, ఇటు నారా వారి వారసురాలిగా తనకు అన్ని కలిసి వస్తాయనే ఆలోచనతో బ్రాహ్మణి కూడా ఉన్నారట.ప్రస్తుతం తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి.
ఆమెకు తెలంగాణ ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ముందుగా అందరూ అంచనా వేసినా, ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం కొన్ని పార్టీలు చేసినా, ప్రజలు మాత్రం ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోవడం , ఇలా అన్నిటినీ అంచనా వేసిన బాబు బ్రాహ్మణిని కూడా రంగంలోకి దించేందుకు ఇదే సరైన సమయం గా డిసైడ్ అయినట్లు సమాచారం.