తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్టుకు నిరసనగా ఆదివారం హైదరాబాద్ ఐటి ఉద్యోగులు( Hyderabad IT Employees ) భారీ ఎత్తున కార్లుతో హైదరాబాదు నుండి రాజమండ్రికి తరలిరావడం జరిగింది.రాజమండ్రిలో నారా బ్రాహ్మణిని కలిశారు.
చంద్రబాబునీ అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఒక వీజనరీ నాయకుడిని జైల్లో పెట్టడం బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో ఐటీ రంగం ఉన్నత స్థాయి ఎదగటానికి ఎంతో కృషి చేశారని లక్షలాదిమందికి ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్షపూరిత చర్య అని అభివర్ణించారు.ఈ క్రమంలో హైదరాబాదులో పనిచేస్తున్న తాము రాజమండ్రికి వస్తున్న సమయంలో ఏపీ పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేశారని నారా బ్రాహ్మణికి తెలియజేశారు.
తమ ఫోన్లు మరియు వాట్సాప్ చాటింగ్ కూడా చెక్ చేశారని పేర్కొన్నారు.సైబరాబాద్ ( Cyberabad ) నిర్మాణంలో చంద్రబాబు చేసిన కృషి కూడా ఈ సందర్భంగా కొనియాడారు.
అనంతరం సంఘీభావంగా వచ్చిన హైదరాబాద్ అయితే ఉద్యోగస్తులను నారా బ్రాహ్మణి( Nara Brahmani ) అభినందించారు.హైదరాబాద్ ఐటి ఉద్యోగులపై ఆంక్షలు బెదిరింపులు దారుణం అన్నారు.పోలీసులు వ్యవహరించిన చర్య వ్యక్తిగత గోప్యత హక్కును హరించడమే అన్నారు.ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొని సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
కచ్చితంగా ఈ సంక్షోభాలను దాటుకుని మరింత శక్తివంతమైన నాయకుడిగా చంద్రబాబు బయటకు వస్తారని వారందరికీ నారా బ్రాహ్మణి భరోసా ఇచ్చారు.