'అఖండ' విజయంపై స్పందించిన నారా బ్రాహ్మణి.. ఏమన్నారంటే?

Nara Brahmani Comments About Balakrishna Akhanda Movie

నందమూరి బాలకృష్ణ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన సినిమా ‘అఖండ’. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అయ్యి ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 Nara Brahmani Comments About Balakrishna Akhanda Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాతో బాలయ్య మిగతా హీరోలకు కూడా భరోసా ఇచ్చారు.కరోనా తర్వాత సినిమాలు విడుదల చేయాలంటే భయపడే స్థాయికి వెళ్లిపోయారు.

ఇక పెద్ద సినిమాల్లో ముందుగా బాలయ్య రావడంతో మిగతా హీరోలకు కూడా లైన్ క్లియర్ అయ్యింది.ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంత ఇంత కాదు.

 Nara Brahmani Comments About Balakrishna Akhanda Movie-అఖండ’ విజయంపై స్పందించిన నారా బ్రాహ్మణి.. ఏమన్నారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య ను బోయపాటిని పొగడ్తలతో ముంచెత్తు తున్నారు.స్టార్ హీరోలు సైతం బాలయ్య అఖండ సినిమాపై కామెంట్స్ చేసారు.

ఎప్పుడు లేనంతగా బాలయ్య సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.

ఇక తాజాగా బాలయ్య అఖండ సినిమాపై ఆయన కూతురు కూడా స్పందించారు.

ఆయన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి తన తండ్రి సినిమాపై తనదైన శైలిలో కామెంట్స్ చేసారు.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Chandrababu, Brahmani, Lokesh-Movie

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.నారా బ్రాహ్మణి తెలుగు ప్రజలందరికి బాగా తెలుసు.బాలయ్య కూతురుగా.

చంద్రబాబు నాయుడి కోడలిగా.నారా లోకేష్ భార్యగా అందరికి సుపరిచితమే.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Chandrababu, Brahmani, Lokesh-Movie

ప్రస్తుతం నారా బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థ కి ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది.ఇక తాజాగా ఈమె బాలయ్య నటించిన అఖండ సినిమాను వీక్షించింది.ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాపై స్పందించింది.”అఖండ సినిమా చూసాను.చాలా అద్భుతంగా ఉంది.అప్పుడు తాతగారు.ఇప్పుడు నాన్నగారు.చిత్ర పరిశ్రమ స్టాండర్స్ ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇంతకుముందు నాన్నగారి సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.ఇప్పుడు అఖండ సినిమా మరొక ఎత్తు.

నిజంగా నేను ఒక తెలుగింటి ఆడపడుచుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను” అంటూ బ్రాహ్మణి అఖండ సినిమాపై స్పందించారు.

#Brahmani #Lokesh #NaraBrahmani #Boyapati #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube