నిజమే గెలిచింది అంటూ నారా భువనేశ్వరి ట్వీట్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం తెలిసిందే.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ( Telugu Desam, Janasena, BJP )నేతలు సంబరాలు స్టార్ట్ చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో గెలుపు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఈ గెలుపు మరింత బాధ్యత పెంచిందని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో నారా చంద్రబాబు నాయుడు మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ ని ఆత్మీయంగా ఆలింగణం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే కూటమి గెలుపు తర్వాత నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) ట్విట్టర్ లో సంచలన ట్వీట్ చేశారు.విజయం సాధించిన కూటమి అభ్యర్థులకు అభినందనలు తెలిపారు."నా సంకల్పం "నిజం గెలవాలి" అన్న నా ఆకాంక్ష ఫలించింది.

Advertisement

అంతిమంగా నిజమే గెలిచింది.ఇంతటి చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు.

అద్భుత ప్రజాదరణతో ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థులందరికీ అభినందనలు" అని ట్వీట్ చేయడం జరిగింది.కూటమి అధికారంలోకి రావడంతో జూన్ 9వ తారీఖు నాడు టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి తెలుగుదేశం శ్రేణులు రెడీ అవుతున్నారు.అంతేకాదు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు సమాచారం.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు