పాపకు పాలు పట్టిచ్చినందుకు ఆయాకు 15ఏళ్ళ జైలు శిక్ష... అసలు కారణం ఇదే...

కొన్ని సార్లు మనం మంచి చేయాలనుకుంటే అదే మనకి చెడు జరిగేలా చేస్తుంది.అలాగే అలాంటి పనుల వల్ల జీవితం తలకిందులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

 Nanny Sentenced To 15 Years Jail Force Feeding-TeluguStop.com

అలాంటి పరిస్థితే ఒక ఆయాకు వచ్చింది.ఆమె ఆయాగా పని చేస్తున్న ఒక ఇంట్లో పాపకు పాలు పట్టించడం తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాల జైలు శిక్ష పడింది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.
నైజీరియా కు చెందిన 73 ఏళ్ళ అలీర్మీ అదేలే అనే వృద్ధురాలు 2016 సంవత్సరం లో అమెరికా లో పని చేయడానికి వచ్చింది.

అమెరికా లో దాదాపు చిన్న పిల్లలు ఉన్న దంపతులు వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఆయాలను పెట్టుకుంటారు.మేరీల్యాండ్ ప్రదేశానికి చెందిన ఒక దంపతులు ఆయా గురించి వెతుకుతుండగా అలిర్మీ వారికి పరిచయం అయింది.

అలా ఆ దంపతులకు చెందిన ఎనిమిది నెలల పాప సంరక్షణ ఆలీర్మీ అదేలే కి అప్పగించారు.ఆమె కూడా ఆ పాప ని చాలా బాగా చూసుకునేది.

అయితే ఒకరోజు ఆ పాపకు ఆకలి వేయడంతో పడుకుని ఉన్న ఆలీర్మీని కాలుతో కొడుతూ నిద్రలేపింది.అదే సమయంలో పక్కన ఉన్న పాలడబ్బాను తీసి పాపకు ఇచ్చింది ఆలీర్మీ.

అయితే పాప తాగకపోవడంతో పాలను ఓ కప్పులో పోసి బలవంతంగా తాగించే ప్రయత్నం చేసింది.పాప ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆలీర్మీ పావు లీటరుకు పైగా పాలను పాపకు పట్టించేసింది

పాపకు పాలు పట్టిచ్చినందుకు ఆ

వెంటనే పాప ఏడవడం ప్రారంభించింది , బుజ్జగిద్దామన్న అలిర్మీ చేతిలోకి తీసుకోగా ఆ పాప సోఫా నుంచి కిందకు జారి పడిపోయింది.ఏమైందో అని చూడగా.పాప మరణించినట్టు ఆలీర్మీకి అర్థమైంది.2016లో ఈ ఘటన జరగగా ఆలీర్మీ కేసులో తాజాగా తీర్పు వెలువడింది.నైజీరియాలో పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడకపోతే బలవంతంగా పట్టడం సహజమని ఆలీర్మీ తరపు లాయర్లు కోర్టులో వాదించారు.

పాప మరణం అనుకోకుండా జరిగిందని జడ్జికి వివరించారు.వాదనలు విన్న జడ్జి ఆయాగా ఉన్న ఆలీర్మీ ఈ పని కావాలని చేసినట్టు అనిపించడం లేదని అదే సమయంలో తనకు తెలీకుండా జరిగినట్టు కూడా అనిపించడం లేదని అన్నారు.

ఆలీర్మీ తాను చేసింది తప్పేనని క్షమించమని కోర్టును కోరినప్పటికీ కోర్టు ఆమెకు 15 ఏళ్లపాటు శిక్షను విధించింది.పాప ఏడుస్తుందని పాలు పట్టించినందుకు 15 ఏళ్ళ జైలు శిక్ష పడింది అంటూ సోషల్ మీడియా లో సానుభూతి తెలుపుతున్నారు నెటిజన్లు….

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube