యంగ్ హీరో నాని 25వ చిత్రంలో హీరోగా కాకుండా విలన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.వి అనే చిత్రంకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సుధీర్ బాబు హీరోగా కనిపించబోతున్నాడు.
ఈ చిత్రంలో విలన్ పాత్రను నాని చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్స్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
ఈ నెల 27వ తారీకున రక్షకుడు ఫస్ట్‌లుక్ రాబోతుంది అన్నారు.
సుధీర్ బాబు తాను రక్షకుడిగా మీ ముందుకు రాబోతున్నాను అంటూ ట్వీట్ చేశాడు.ఇక 28వ తారీకును రాక్షసుడు ఫస్ట్ లుక్ అంటే నాని ఫస్ట్‌లుక్ రాబోతుంది.
ఈ చిత్రంలో సుధీర్‌బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు.నాని మాత్రం విలన్‌గా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
ఫస్ట్‌లుక్స్ ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటి వరకు హీరోగా మాత్రమే నానిని చూశాం.
వి చిత్రంలో మొదటి సారి విలన్‌గా చూడబోతున్నాం.