నాన్నకు ప్రేమతో విడుదల వాయిదా

షూటింగ్ మొత్తం డిసెంబర్ మొదటివారంలో అయిపోతుంది అన్నారు, మూడోవవారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి అన్నారు.ఇంకా ఒక పాట, 3 రోజుల టాకీ, పాచ్ వర్క్, రీరికార్డింగ్ మిగిలి ఉంది.

 Nannaku Prematho Not Ready For Sankranthi-TeluguStop.com

ముందు నుంచి చెప్పుకొచ్చిన విడుదల తేది జనవరి 13, 2016.ఇంకా ఇరవై రోజులు మిగిలి ఉంది.

పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడితే పని పూర్తవుతుందేమో.

ఆడియో ఫంక్షన్ ఎప్పుడు ? సినిమా సంక్రాంతికి నిజంగానే వస్తుందా లేదా ? ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకటే కలవరపాటు.హీరోని ట్విట్టర్లో అడిగారు.అసలు నాకే అర్థం కావట్లేదు ఏది ఎప్పుడు జరుగుతుందో అని ఎన్టీఆర్ నుంచి ట్వీట్.అభిమానులో ఆందోళన.కాసేపటి ట్వీట్ కనిపించలేదు.

అకౌంట్ హ్యాక్ అయిందని మళ్ళి ట్వీట్.గత నెల రోజులుగా ఎన్టీఆర్ అభిమానులు నరకం చూస్తున్నారు.

సినిమా సంక్రాంతికే అంటారు.బిజినెస్ ఏమో పూర్తవదు.

పొంగల్ కే వస్తున్నామని పోస్టర్స్ వదులుతుంటారు.కాని షూటింగ్ మాత్రం పూర్తవదు.

హీరోని అడిగితే హీరో కుడా కన్ఫ్యూజ్ చేస్తాడు.ఎవరిని అడగాలి ! ఇక ఎవరిని అడగాల్సిన అవసరం లేదేమో !

ఎందుకంటే నాన్నకు ప్రేమతో సంక్రాంతికి రావట్లేదని సినివర్గాల నుంచి బలమైన వార్త.

మరి పనులు పూర్తీ కాకపోవడం వలన రావట్లేదా, బిజినెస్ జరగట్లేదని రావట్లేదా లేక కొన్ని రాజకీయ శక్తులకి తలవంచి వెనకడుగు వేసారా ? ఇప్పటికైనా ఎన్టీఆర్ నోరువిప్పితే బాగుండు !

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube