‘బాహుబలి’ సినిమా తర్వాత టాలీవుడ్ లెక్కలు అన్ని కూడా తారు మారు అయ్యాయి.ఆ సినిమా ముందు వరకు టాలీవుడ్ 100 కోట్లు సాధించడం కష్టం అని అంతా భావించారు.
కాని ఆ సినిమా ఏకంగా 650 కోట్లకు పైగా సాధించి రికార్డులు బద్దలు కొట్టింది.ఆ వెంటనే విడుదల అయిన ‘శ్రీమంతుడు’ చిత్రం 100 కోట్లు వసూళ్లు చేసింది.
దాంతో ఇప్పుడు అంతా కూడా టాలీవుడ్ సినిమా వంద కోట్లపై దృష్టి ఉంది.ఇక త్వరలో రాబోతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం 100 కోట్లు రాబట్టాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే అది కష్టం అని మాత్రం సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
‘నాన్నకు ప్రేమతో’ చిత్ర యూనిట్ సభ్యులు ఈ చిత్రానికి 75 కోట్లు రావడం ఖాయం అనే ధీమాతో ఉన్నారు.
ఈ చిత్రం 50 కోట్లకు పైచిలుకు బడ్జెట్తో తెరకెక్కింది.ఈ చిత్రం ఎన్టీఆర్కు 25వ చిత్రం అవ్వడంతో పాటు, ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ మరియు సుకుమార్ దర్శకత్వం ఈ సినిమాకు వసూళ్ల వర్షం తేవడం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు ఆశిస్తున్నారు.
ఫ్యాన్స్ 100 కోట్లు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నా, చిత్ర యూనిట్ మాత్రం 75 కోట్లు ఖచ్చితంగా వసూళ్లు చేస్తుందని, అంతకు మించి కూడా వసూళ్లు చేసే అవకాశాలున్నాయి.కాని ఈ చిత్రంతో పాటు మరో మూడు చిత్రాలు విడుదల అవుతున్నాయి.
ఆ సినిమాల కలెక్షన్స్ను బట్టి ఈ చిత్రం కలెక్షన్స్ ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.