భారి అంచనాల నడుమ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో ఈ రోజు విడుదలైంది.హైదరాబాద్ లో ఇప్పటికే చాల షోలు పూర్తయ్యాయి.
సీడెడ్ లో కొన్ని ప్రాంతలలో రెండో విడత స్పెషల్ షోలు మొదలయ్యాయి.మరి టాక్ ఎక్కడ ఎలా ఉందొ తెలుసుకుందాం.
ప్రతి పెద్ద సినిమాకి జరిగినట్టే హైదరాబాద్ శ్రీరాములు థియేటర్లో మీడియా, ఫ్యాన్స్ కి బెనిఫిట్ షో ఏర్పాటు చేసారు.ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా ఉంది.
ఎన్టీఆర్ స్టయిల్, జగపతి బాబు విలనిజం, మధ్య మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ తో ఫస్టాఫ్ ఫర్వాలేదు అన్నట్టుగానే సాగిందంటున్నారు.ఇంటర్వెల్ కి ముందు 10 నిమిషాలు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే స్లో గా ఉంది కంప్లేంట్ కుడా ఉంది.
సెకండాఫ్ మీద నెగెటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
క్లయిమాక్స్ మినహా పెద్దగా ఎక్కడా సినిమాకు పెద్ద కనెక్ట్ అవడం కష్టమే అంటున్నారు.చాలా సీన్స్ బాగున్నప్పటికీ, మొత్తంగా నాన్నకు ప్రేమతో వీపరీతంగా కాకపోయినా, క్లాస్ ఆడియెన్స్ ని, కొత్త రకం సినిమాలు కోరుకునేవారిని మెప్పించే సినిమా.
ఎన్టీఆర్ నటనాప్రతిభని ఎంత మెచ్చుకున్న తక్కువే అని ప్రేక్షకుల అభిప్రాయం.
ఏ సెంటర్స్ లో, ఓవర్సీస్ లో బాగా ఆడటం ఖాయమని, బి,సి సెంటర్లలో సినిమాలు చూసేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చని, అసలు టాక్ సాయంత్రం వరకు తెలిసిపోతుందని విశ్లేషించారు ట్రేడ్ ప్రముఖులు.