నాని ఇచ్చిన సర్ప్రైజ్ కి ఎమోషనల్ అయిన బాలయ్య!

నటసింహం నందమూరి బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’. ఈ షో ఆహా ఓటిటి లో దీపావళి పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే.

 Nanis Surprise To Nbk On Unstoppable Details, Unstoppable With Nbk, Nandamuri Ba-TeluguStop.com

మోహన్ బాబు మొదటి గెస్ట్ గా రావడంతో ఈ షోపై మరింత ఆసక్తి పెరిగింది.ఇక ఈ ఎపిసోడ్ తర్వాత బాలయ్య నాని ని ఈ షో కు గెస్ట్ గా పిలిచాడు.

అయితే ఈ షో లో నాని బాలయ్యకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఇక ఈ సర్ప్రైజ్ చుసిన బాలయ్య చాలా ఎమోషనల్ అయ్యాడు.

పది సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయారు.ఈ ఎపిసోడ్ లో నాని ని గెస్ట్ గా పిలిచిన బాలయ్య ఈ ఎపిసోడ్ మొత్తం కూడా నాని తో చాలా సరదాగా మాట్లాడారు.

నాని తో కలిసి బాలయ్య ఫన్నీగా క్రికెట్ కూడా ఆడాడు.ఇక హోస్ట్ గా ఉన్న బాలయ్యకే నాని ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఇది ఎవ్వరు కూడా ఊహించలేదు.

ఈ షో మధ్యలో నాని బాలయ్యకు ఒక చిన్న అమ్మాయిని పరిచయం చేసాడు.

అయితే బాలయ్య మాత్రం ఆ అమ్మాయిని ముందు గుర్తు పట్టలేదు.

Telugu Aha Ott, Allu Aravind, Balayya, Basavatarkam, Cancer, Nani, Naninbk, Nani

అప్పుడు నాని ఈ అమ్మాయి ఎవరో చెప్పడంతో బాలయ్య కొద్దిగా ఎమోషనల్ అయినట్టు కనిపించింది.ఈ పాప ఎవరంటే బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కొన్ని ఏళ్ల క్రితం బాలకృష్ణ సహాయంతో చికిత్స పొందింది.

Telugu Aha Ott, Allu Aravind, Balayya, Basavatarkam, Cancer, Nani, Naninbk, Nani

అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత బాలయ్య ఆ పాపను చూడడంతో సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఆ పాప పూర్తిగా కోలుకుందని తెలిసి సంతృప్తి కూడా చెందినట్టు కనిపించింది.ఆ పాప ఎవరో తెలిసిన తర్వాత బాలకృష్ణ ఆ అమ్మాయిని ప్రేమగా పలకరించడమే కాకుండా ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.ఇక ఈ పాప గురించి ఇన్నేళ్ల తర్వాత నాని ద్వారా బయటకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube