సెన్సార్ పూర్తి చేసుకున్న నాని "వి" సినిమా

న్యాచురల్ స్టార్ నాని మొదటి సారి పూర్తి స్థాయిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సినిమా వి.ఈ సినిమాలో సుదీర్ బాబు హీరో పాత్రలో నటిస్తున్నాడు.

 Nani's Movie V Get Censor Clearance, Tollywood, Sudheer Babu, Indraganti Mohana-TeluguStop.com

అయితే వి నాని సినిమా అంటూ ఎక్కువగా ప్రచారం జరుగుతుంది.నిజానికి ఇది మల్టీ స్టారర్ సినిమా.

ఇక సినిమాలో అధితీరావ్ హైదరీ, నివేతా థామస్ హీరోయిన్స్ గా చేశారు.దిల్ రాజు నిర్మాణం, ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కి పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయిపొయింది.

అయితే కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు ఓపెన్ అయ్యేంత వరకు వేచి చూడాలని ముందుగా భావించారు.అయితే ఇప్పుడు ఒటీటీ రిలీజ్ కి రెడీ అయ్యాడు.

సెప్టెంబర్ 5న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.ఈ విషయాన్ని నాని కూడా కన్ఫర్మ్ చేశాడు.

ముందుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం నాని పెద్దగా ఆసక్తి చూపించకపోయిన అమెజాన్ వాళ్ళు ఎక్కువ మొత్తంలో రైట్స్ రూపంలో చెల్లించేందుకు ముందుకి రావడంతో దిల్ రాజు రెడీ అయ్యి, దర్శకుడు, హీరోని ఒప్పించారు.ఇక థియేటర్ లో రిలీజ్ కాకపోవడం సినిమా ప్రమోషన్ ఖర్చు కూడా పూర్తిగా తగ్గిపోయినట్లే కాబట్టి దిల్ రాజు ఓటీటీ వైపు మొగ్గు చూపించాడు.

సినిమా హిట్ గ్యారెంటీ అనే టాక్ ఉండటంతో ఓటీటీలో కూడా ఆదరణ బాగుంటుందని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.దీనికి యూ/ఏ సర్టిఫికేట్ సెన్సార్ వాళ్ళు ఇచ్చారు.ఇక సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అని, ఇందులో నాని పెర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా కావడం పక్కా అని చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి పాజిటివ్ బజ్ తో రిలీజ్ అవుతున్న నాని వి ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube