విక్రమ్ కె కుమార్ సినిమా స్టార్ట్ చేసిన నాని!

విభిన్న చిత్రాల దర్శకుడుగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్.అతని చివరిగా హలో తో అఖిల్ లో మరో ఫ్లాప్ ఇచ్చాడు.

 Nani24 Movie Launching With Vikram K Kumar Direction-TeluguStop.com

అయితే అతని టాలెంట్ గురించి ఎవరికీ అనుమానం లేదు.దీంతో అల్లు అర్జున్ అతనికి అవకాశం ఇచ్చాడు.

అయితే లాస్ట్ మినిట్ లో విక్రమ్ సినిమాని పక్కన పెట్టి త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి అల్లు అర్జున్ రెడీ కావడంతో దర్శకుడు విక్రం కుమార్ నానితో ప్రాజెక్ట్ ఒకే చేసుకున్నాడు.హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో తయారు చేసుకున్న డిఫరెంట్ కథతో నాని ని మెప్పించిన దర్శకుడు తాజాగా ఆ సినిమాని స్టార్ట్ చేసేసాడు.

 Nani24 Movie Launching With Vikram K Kumar Direction-విక్రమ్ కె కుమార్ సినిమా స్టార్ట్ చేసిన నాని-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా ఐదు మంది హీరోయిన్స్ నటిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్స్ ని దర్శకుడు విక్రం ఫైనల్ చేయగా, మిగిలిన ఇద్దరు కోసం కాస్టింగ్ సెలెక్షన్ జరుగుతుందని సమాచారం.

అలాగే ఈ సినిమాలో నానికి విలన్ గా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ద్ ని రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.తాజాగా ఈ సినిమా ప్రారంబోత్సవం పూజా కార్యక్రమాలు నాని, విక్రం స్టార్ట్ చేసారు.

ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది.ఇది పూర్తయిన వెంటనే విక్రమ్ సినిమాని రెగ్యులర్ షూటింగ్ ని మొదలెట్టే అవకాశం వుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని నాని కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు