నానికి అర్జెంట్ హిట్ కావాలి..!

నాచురల్ స్టార్ నాని హిట్లు ఫ్లాఉలు సమతూకం వేసుకుంటూ వస్తున్నాడు.నాని ప్రతి సినిమాకు సూపర్ బజ్ ఏర్పడుతుంది.

 Nani Wants Urgent Hit Movie , Nanai Movie, Nanai Shyasingh Roy, Nani Ssr, Natura-TeluguStop.com

అయితే ఆ సినిమా ఫలితం మాత్రం ఆడియెన్స్ చేతుల్లో ఉంటుంది.నాని చివరగా నటించిన రెండు సినిమాలు వి, టక్ జగదీష్ రెండు ఓటీటీ రిలీజ్ అవడంతో ఆ సినిమాల ఇంప్యాక్ట్ వేరేలా ఉండింది.

సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా నానిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.దానికి తోడు నాని సినిమాల ఓటీటీ రిలీజ్ అవడం వల్ల కమర్షియల్ గా సక్సెస్ అయ్యిందా లేదా అన్నది తెలియట్లేదు.

అందుకే నెక్స్ట్ చేసే సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయితేనే కమిట్ అవుతున్నాడు.అయితే ప్రస్తుతం నానికి అర్జెంట్ గా ఒక హిట్ పడాల్సిన అవసరం ఉంది.వి నెగటివ్ పాత్రలో మెప్పించినా.టక్ జగదీష్ అంటూ వచ్చినా ప్రేక్షకులు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు.

అందుకే నాని తను చేస్తున్న శ్యాం సింగ రాయ్, అంటే సుందరానికీ ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాలని చూస్తున్నాడు.శ్యాం సింగ రాయ్ నాని కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుంది.

ఆ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube