నాని ఆ సెంటిమెంట్‌కు బలవుతాడా?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘వి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నాని నెగెటివ్ పాత్రలో నటిస్తు్న్నాడు.

 Nani V Movie To Face Negative Sentiment-TeluguStop.com

దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక మరో హీరో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో వి చిత్రం రిలీజ్‌ను వాయిదా వేశారు.

అయితే లాక్‌డౌన్‌ ప్రకటించకు ముందే ఈ సినిమాను ఒకసారి వాయిదా వేశారు.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో ఖచ్చితంగా తెలియని పరిస్థితి.

అయితే ఈ సినిమాకు ఓ నెగెటివ్ సెంటిమెంట్ అడ్డుగా మారింది.ఇన్నిసార్లు వాయిదా పడ్డ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనే వాదన ప్రస్తుతం వి చిత్రాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే ఈ కోవలోకి అర్జున్ సురవరం చిత్రం కూడా చాలాసార్లు వాయిదా పడుతూ రావడంతో ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయ్యింది.అయితే సినిమాలో దమ్ముండటంతో ఆ సినిమా విజయాన్ని అందుకుంది.

మరి నాని వి చిత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube