హీరో నేనే విలన్ కూడా నేనే అంటోన్న నాని

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్‌ను ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతుంది.ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Nani As Villain And Hero In V Movie, Nani, V Movie, Sudheer Babu, Nivetha Thomas-TeluguStop.com

కాగా ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో గతకొంత కాలంగా చక్కర్లు కొడుతుండటంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.ఇక ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలో నాని చేయబోయేది ఏ పాత్ర అనే విషయంపై సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాలో రెండు జన్మల కథను మనకు చూపించనున్నారట.

మొదటి జన్మలో విలన్ పాత్రలో కనిపించే నాని, రెండో జన్మలో హీరోగా కనిపిస్తాడట.ఇక సుధీర్ బాబు కూడా ఇలానే విలన్, హీరో పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది.

వారిద్దరి మధ్య సాగే పోరాటాన్ని ఈ సినిమాలో మనకు చూపెట్టనున్నారు.

మొత్తానికి పునర్జన్మ అనే కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్రగంటి.

కాగా ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అయితే ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

అయితే ఈ సినిమాలోని ట్విస్టులు మాత్రం ప్రేక్షకులను కట్టిపడేయడంలో పూర్తిగా సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube