దుకాణం సర్దేసుకున్న నాని.. ‘వి’ చిత్రం చూసే టైమ్ వచ్చేసింది!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి నాని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవాలని చూస్తున్నాడు.

 Nani V Movie Sold Out To Ott, Nani, V Movie, Dil Raju, Ott, Sudheer Babu, Nivedh-TeluguStop.com

కాగా ఈ సినిమాలో నానితో పాటు మరో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బల్లాక్‌బస్టర్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమాను మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్నాడు.

అయితే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాల్సిందిగా పలు ఆఫర్లు చిత్ర నిర్మాత దిల్ రాజు ముంగిట వాలాయట.కానీ ఆయన ఈ ఆఫర్లను రిజెక్ట్ చేస్తూ వచ్చాడు.

దీంతో ఈ సినిమా రిలీజ్ మరింత వాయిదా పడుతూ వస్తోంది.కాగా ఇప్పట్లో థియేటర్లలో సినిమా రిలీజ్ అసాధ్యం అని అనిపిస్తుండటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ మక్కువ చూపిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌కు ‘వి’ చిత్ర హక్కులను అమ్మేసినట్లు తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ సినిమాను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌కు భారీ మొత్తానికి దిల్ రాజు అమ్మినట్లు, అందుకే ఈ సినిమాను సెప్టెంబర్‌ తొలి వారంలోనే ప్రేక్షకులకు అందించేందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఇదే నిజమైతే గనక తెలుగు చిత్రాల్లో తొలిసారి ఓ పెద్ద సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube