'వి' థియేటర్‌ రిలీజ్‌ ఉందా? లేదా?

నాని, సుధీర్ బాబు కీలక పాత్రలో నటించిన ‘వి’ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది.మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.

 V Movie Not Releasing In Theaters, V Movie Release, Amazon Prime, Lockdown, Unlo-TeluguStop.com

థియేటర్లలో విడుదల చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ చేసి ప్రమోషన్‌ చేస్తున్న సమయంలో కరోనా లాక్డౌన్ కారణంగా సినిమాను వాయిదా వేశారు.అప్పటి నుండి దాదాపు ఆరు నెలలు వెయిట్ చేసి థియేటర్లు ఓపెన్‌ కు ఇంకా టైం పడుతుందేమో అనే ఉద్దేశంతో అమెజాన్ వారికి ఈ సినిమాను అమ్మడం జరిగింది.

సినిమా స్ట్రీమింగ్ కి ముందు థియేటర్ రిలీజ్ కు సంబంధించి కూడా ఒప్పందం జరిగిందంట.
ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాను బి, సి సెంటర్లలో విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు.

తన వద్ద ఉండే థియేటర్లలో అయినా ఈ సినిమాను ప్రదర్శించడం ద్వారా మినిమమ్ ఎమౌంట్ వస్తుందని ఆయన భావించాడట.అందుకు గాను ఏర్పాట్లు కూడా చేశాడు.అయితే ఈ సినిమాకు సోషల్‌ మీడియా ద్వారా నెగటివ్ టాక్ వచ్చింది.సినిమా మరీ మూసగా ఉందంటూ రివేంజ్ డ్రామా కొత్తగా లేదంటూ అంతా పెదవి విరిచారు.

దాంతో ప్రేక్షకులకు మళ్లీ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్తే ఒప్పుకుంటారా లేదా అనే సందేహంలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.అందుకే థియేటర్లలో విడుదల చేయాలనే ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు గా సమాచారం అందుతోంది.

ఈ విషయమై చిత్ర యూనిట్ సభ్యుల నుండి కూడా అనధికారిక స్పష్టత వస్తుంది.అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లు ఓపెన్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయమై ఎలాంటి హడావుడి లేకపోతే వడం వల్ల థియేటర్ లలో ‘వి’ విడుదల లేనట్లే అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అనుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube