శ్యామ్ సింగరాయ్ లో కూడా నాని పాత్ర అలానే ఉంటుంది

నేచురల్ స్టార్ నాని కెరియర్ లో ఈ మధ్యకాలంలో కాస్తా భిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.రొటీన్ కథలని పక్కన పెట్టి ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్లు తనని తాను మార్చుకుంటూ కొత్త కథల పంథాలో వెళ్తున్నాడు.

 Nani Try To Negative Role In Shyam Singarai Movie, Tollywood, Telugu Cinema, V M-TeluguStop.com

ఈ నేపధ్యంలో ప్రస్తుతం వి సినిమాలో మొదటి సారి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

దీని తర్వాత నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇదిలా ఉంటే దీంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో రాహుల్ సాంకృత్యాన్ తో నాని శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక పునర్జన్మల నేపధ్యంలో నడిచే కథాంశంగా ఇది ఉండబోతుంది.

ఇందులో నాని కెరియర్ లో మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు.అందులో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని సమాచారం.

ఇక ఈ పాత్ర ప్రాధాన్యత సినిమా తర్వాత కూడా చాలా కాలం ఉండిపోతుంది అనే టాక్ వినిపిస్తుంది.నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తే నటన పరంగా అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే అవకాశం ఉంటుంది.

అలాగే తనలోని నటుడుని పూర్తిగా తెరపై ఆవిష్కరించవచ్చనే ఉద్దేశ్యంతో నాని ఈ రకమైన ప్రయోగాలు ఈ మధ్యకాలంలో చేస్తున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి తనలో ఉన్న దర్శకుడుతో నాని ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్లుగా కథలు మార్చుకొని హీరోగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube