ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు ఇంకా ఎవరు రాబోతున్నారు?

కరోనా కారణంగా ఆరు నెలల నుండి థియేటర్లు మూత పడే ఉన్నాయి.రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలు అలాగే ల్యాబ్‌లో పడి ఉన్నాయి.

 After Nani V Movie Witch Movies Are Read For Ott Release , Nani, V, Mohanakrishn-TeluguStop.com

తెలుగులో చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాకూడా ఓటీటీపై ఆసక్తి లేకపోవడంతో ముందుకు రాలేదు.కాని ఇప్పుడు ఓటీటీ విడుదలకు సంబంధించి నాని ‘వి’ సినిమాతో ముందడుగు వేశాడు.

దాంతో ఇకపై వరుసగా సినిమాలు వస్తాయేమో అనుకుంటున్నారు.ఇలాంటి సమయంలో వచ్చిన నాని ‘వి’ సినిమా నిరుత్సాహ పర్చింది.

ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు అన్ని కూడా బొక్క బోర్లా పడుతున్నాయి.అదే దారిలో ‘వి’ కూడా నిరుత్సాహపర్చింది.

నాని ‘వి’ పై సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.నాని 25వ సినిమా అవ్వడంతో పాటు ఇప్పటికే మోహనకృష్ణ దర్శకత్వంలో నాని చేసిన రెండు సినిమాలు హిట్‌ అవ్వడంతో ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనుకున్నారు.

కాని ఫలితం తారు మారు అవ్వడంతో మొత్తం అంతా కూడా నిరుత్సాహంలో ఉన్నారు.నాని సినిమా సక్సెస్‌ అయ్యి ఉంటే ఖచ్చితంగా చాలా సినిమాలు ఓటీటీ దారి పట్టేవి.

కాని ఇప్పుడు కాస్త పేరున్న హీరోల నుండి దాదాపు అంతా కూడా ఓటీటీ అంటే బాబోయ్‌ వద్దులే అన్నట్లుగా భావిస్తుంటారు.

Telugu Amazon Prime, Nani, Telugu, Theaters, Review-

మెగా హీరోల సినిమాల నుండి యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల వరకు చాలా ఓటీటీ వైపు చూసినవి ఉన్నాయి.కాని ఓటీటీ సెంటిమెంట్‌ కంటిన్యూ అవుతున్న కారణంగా ఇప్పుడు సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం ఏమాత్రం సమంజసం కాదని అంటున్నారు.నిర్మాతలు కాస్త ఇబ్బందుల్లో ఉన్నా తమ పారితోషికం విషయంలో మార్పులు చేర్పులు చేసుకుని అయినా థియేటర్లలోనే తమ సినిమాలు విడుదల చేయాలని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube