'వి' కి ఇంటర్వెల్‌ ఉండి ఉంటే అప్పుడే వెళ్లిపోయేవారు

నాని, సుధీర్‌ బాబులు నటించిన ‘వి’ సినిమా నేడు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలుగు నుండి వచ్చిన మొదటి పెద్ద సినిమా అవ్వడంతో అంతా కూడా ఎంతో ఆసక్తి చూపించారు.

 Social Media Comments On V The Movie , Nani, V, Sudheer Babu, Social Media Troll-TeluguStop.com

అద్బతమైన సినిమా అంటూ యూనిట్‌ సభ్యులు ప్రచారం చేశారు.తీరా సినిమా విడుదల అయిన తర్వాత చూస్తే మొత్తం డొల్ల అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.సోషల్‌ మీడియాలో ఈ సినిమాపై వస్తున్న మీమ్స్‌ అన్ని ఇన్నీ కావు.‘వి’ సినిమా ను ఒక భారీ అంతరిక్ష ప్రయోగంగా అభివర్ణించారు.కాని అది కనీసం ప్రయోగశాలను కూడా దాటి వెళ్లలేక పోయింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక నిన్న నాని ట్విట్టర్‌ లో ‘వి’ సినిమా గురించి ప్రమోట్‌ చేస్తూ ఈ సినిమాకు ఇంటర్వెల్‌ ఉండదు అంటూ ట్వీట్‌ చేశాడు.సినిమా విడుదల తర్వాత ఆ ట్వీట్‌ కు చాలా మంది చిత్ర విచిత్రంగా కామెంట్స్‌ చేస్తున్నారు.‘వి’ సినిమాకు తప్పనిసరిగా ఇంటర్వెల్‌ ఉండాలి.ఉండి ఉంటే అప్పుడే వెళ్లి పోయేవారు.సినిమా మొత్తం చూడాల్సి ఉండదు అంటున్నారు.ఇంట్లో కాబట్టి ఇది చూశాం.థియేటర్లలో అయితే ఇది ఎలా చూసేవాళ్లం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇంత సైకో సీన్స్‌ ను ఎలా చూస్తాం అని దీనికి చూడమంటున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు.

తల తీసి చేతిలో పెట్టడం, కత్తితో కోస్తే రక్తం బయటకు వస్తున్నట్లుగా కనిపించడం వంటివి చూస్తే పిల్లలు భయపడేలా సీన్స్‌ ఉన్నాయి.

ఈ సినిమా పిల్లలతో కలిసి చూసే విధంగా లేదంటూ మరికొందరు అంటున్నారు.సున్నిత మనస్కులు అయిన ఆడవారు ఈ సినిమాను చూడకుంటేనే బెటర్‌ అంటూ మరికొందరు హెచ్చరిస్తున్నారు.

మొత్తానికి ‘వి’ సినిమాను సోషల్‌ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆడేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube