నాని టక్ జగదీష్ ట్రైలర్.. యాక్షన్ అండ్ ఎమోషన్..!

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వస్తుంది టక్ జగదీష్.షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మించారు.

 Nani Tuck Jagadish Trailer Action And Emotional Entertainar, Nani Tuck Jagadish-TeluguStop.com

థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేద్దామని అనుకున్నా నిర్మాతల ఆర్ధిక ఇబ్బందుల వల్ల డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఫిక్స్ చేశారు.

అమేజాన్ ప్రైం లో సెప్టెంబర్ 10న టక్ జగదీష్ సినిమా రిలీజ్ అవుతుంది.ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా టక్ జగదీష్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్ చూస్తే సినిమా యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీగా రాబోతుందని అర్ధమవుతుంది.ఫ్యామిలీ అంటే ప్రాణం ఇచ్చే టక్ జగదీష్ ఆ ఫ్యామిలీకి దూరమైతే.

మళ్లీ ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ఎలా జరిగాయి అన్నది సినిమా కథ.సినిమాలో నానితో పాటుగా ఆయన అన్న పాత్రలో జగపతి బాబు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమాపై మరింత అంచనాలు పెంచింది. సినిమా డిజిటల్ రిలీజ్ అవుతున్నా తెలుగు ప్రేక్షకులు ఎక్కడైనా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నామని చిత్రయూనిట్ గట్టి నమ్మకంగా చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube