టక్ జగదీష్ టీజర్ టాక్: పక్కా ఫ్యామిలీ కంటెంట్‌తో దిగుతున్న నాని!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని చాలా స్టైలిష్‌గా టక్ వేసుకుని కనిపిస్తున్నాడు.

 Nani Tuck Jagadish Teaser Very Impressive, Nani, Tuck Jagadish, Ritu Varma, Shiv-TeluguStop.com

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

ఈ టీజర్ చూస్తుంటే నాని ఈసారి సాలిడ్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడని చెప్పొచ్చు.
ఇక ఈ టీజర్ మొత్తం హీరో పాత్రకు సంబంధించిన ఎలివేషన్ సాంగ్‌తో ప్రేక్షకులకు చూపించారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో నాని ఓ పెద్ద ఫ్యామిలీకి చెందినవాడిగా మనకు కనిపిస్తున్నాడు.ఇక నాని అన్నయ్యగా జగపతిబాబు నటిస్తుండగా, కుటుంబ సభ్యుల పాత్రల్లో చాలా మంది నటీనటులు ఉన్నారు.

కాగా అందాల భామ ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో నాని మరదలి పాత్రలో నటిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది.ఇక హీరోయిన్‌గా అందాల భామ రీతూ వర్మ ఈ సినిమాలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక ఆమెను ప్రేమించే క్రమంలో నానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయా అనే అంశాలను కూడా మనకు ఈ సినిమాలో చూపించబోతున్నారు.
మొత్తంగా ఓ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కధతో నాని ఈ సారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఈ టీజర్ చూస్తుంటే మనకు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు థమన్ మరోసారి అదిరిపోయే సంగీతం అందిస్తున్నట్లు ఈ టీజర్‌లోని పాట వింటే తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో నాని పాత్ర ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటుందని, ఈ సినిమాలో నాని పవర్‌ప్యాక్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది.

వేసవి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నాని ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube