ఓటీటీ సినిమాలకు కూడా ఇలాంటి ప్రమోషన్స్ ఏంటీ టక్కు?

నాని నటించిన టక్‌ జగదీష్ సినిమాను ఖచ్చితంగా థియేటర్ల ద్వారా తీసుకు వస్తారని అంతా భావించారు.కాని సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేయడం జరిగింది.

 Nani Tuck Jagadish Movie Success Meet-TeluguStop.com

నాని థియేటర్ రిలీజ్ కు రాకపోవడంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి.అయినా కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా నాని తన టక్ జగదీష్ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ చేశాడు.

ఈమద్య కాలంలో ఏ ఓటీటీ మూవీకి దక్కని పబ్లిసిటీ మరియు మీడియా స్పేస్ టక్‌ జగదీష్‌ కు దక్కింది.అంతటి గుర్తింపు దక్కించుకున్న టక్ జగదీష్ సినిమా నిరాశ పర్చింది.

 Nani Tuck Jagadish Movie Success Meet-ఓటీటీ సినిమాలకు కూడా ఇలాంటి ప్రమోషన్స్ ఏంటీ టక్కు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా విడుదల విషయంలో గందరగోళం ఏమో కాని విడుదల అయిన తర్వాత సినిమాకు నెగటివ్ టాక్ రావడంతో అంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు.

సాదారణంగా ఓటీటీ సినిమా అంటే విడుదల తర్వాత జనాలు చూసుకుంటారు.

మేకర్స్ మాత్రం ప్రమోషన్ విషయంలో పట్టింపు లేకుండా ఉంటారు.కాని టక్‌ జగదీష్ మాత్రం విడుదల తర్వాత కూడా నాదే బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.

టక్ జగదీష్ సినిమా సక్సెస్ చేసినందుకు థ్యాంక్యూ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వస్తున్నారు.

Telugu Amazon Prime, Flop Movie, Nani, Negative Talk, Ott Movie, Shiva Nirvana, Tollywood, Tuck Jagadeesh, Tuck Jagadish Thankyou Meet-Movie

సినిమా ప్లాప్ అయ్యింది.అది కూడా ఓటీటీ సినిమా అయినా కూడా ఇలా థ్యాంక్యూ మీట్‌ ఏంటీ భయ్యా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.నెట్టింట ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూనే ఉంది.

ప్రస్తుతం టక్ జగదీష్ కు సంబంధించిన రిపోర్ట్‌ ను అమెజాన్ ఏమని ఇస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.సినిమా ను ఎంత మంది చూశారు.కామెంట్స్ ఎలా వచ్చాయి అనేది వారు వెళ్లడించాలని అభిమానులు కోరుకుంటున్నారు.సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాగానే జనాలు చూశారు అనేది టాక్.

అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.

#Negative #Shiva Nirvana #Ott #Amazon Prime #Tuck Jagadeesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు