పండగకే టక్ వేస్తానంటోన్న జగదీష్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే.ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయగా దానికి మిశ్రమ స్పందన లభించింది.

 Nani Tuck Jagadish Aiming Sankranthi, Tuck Jagadish, Nani, V, Shiva Nirwana, Tol-TeluguStop.com

అయితే ఈ సినిమా రిజల్ట్‌తో కాస్త అప్‌సెట్ అయిన నాని, ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘టక్ జగదీష్’ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలోనే టక్ జగదీష్ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే టక్ జగదీష్ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించింది.అంతేగాక నవంబర్ చివరినాటికి ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి పండుగ సీజన్‌లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ యోచిస్తోంది.అయితే సంక్రాంతి బరిలో పలు భారీ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి పోటీని ఇవ్వగలదని పలువురు క్రిటిక్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర వర్గాల్లో ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను ‘మజిలీ’ చిత్ర నిర్మాతలు సాహు గరపాటి, హరీష్ పెద్ది ప్రొడ్యూస్ చేస్తుండటంతో మరోసారి మజిలీ తరహా కాంబినేషన్ హిట్ రావడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube