నాని, నాగచైతన్యలు కాంప్రమైజ్ అవుతున్నారు.. ఒక్కరు ముందు మరొకరు తర్వాత

గత ఏడాది సినిమాలు కరోనా కారణంగా విడుదల కాలేదు.2019లో ప్రారంభం అయిన సినిమాలు కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు.ఇక ఇటీవల ప్రారంభం అయిన సినిమాలు కూడా సమ్మర్ విడుదలకు సిద్దం అవుతున్నాయి.పాత కొత్త సినిమాలు కలిపి వరుసగా బాక్సాఫీస్ ముందుకు దూసుకు వస్తున్నాయి.కరోనా కారణంగా థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించేందుకు అనుమతులు వచ్చాయి.అతి త్వరలోనే నూరు శాతం ఆక్యుపెన్సీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి.

 Nani Tuck Jagadhish Movie Release Date Change Because Of Love Story Movie ,tolly-TeluguStop.com

రికార్డు స్థాయిలో వారంలో పది సినిమాల చొప్పున చిన్నా పెద్ద సినిమాలు కలిసి బాక్సాఫీస్ వార్‌ కు సిద్దం అవుతున్నాయి.ఆ నేపథ్యంలో కొన్ని సినిమాలు క్లాష్‌ అవుతున్నాయి.

ఒకే రోజు రెండు మూడు సినిమాలు కూడా వస్తున్న నేపథ్యంలో అంచనాలు తారు మారు అవుతున్నాయి.థియేటర్లు దొరక్క బయ్యర్లు కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది.

నాగచైతన్య నటిస్తున్న లవ్‌ స్టోరీ మరియు నాని నటించిన టక్‌ జగదీష్‌ సినిమాలు ఒకే రోజున అంటే ఏప్రిల్‌ 16న విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

రెండు సినిమాలు కూడా ఒకే రోజున రాబోతున్న నేపథ్యంలో ముందు నుండే బయ్యర్లు జుట్టు పీక్కుంటున్నారు.

రెండు సినిమాలు కూడా మంచి క్రేజీ మూవీస్ అవ్వడం వల్ల ఎక్కువ థియేటర్లను బయ్యర్లు ఆశిస్తున్నారు.కాని థియేటర్లు మాత్రం రెండు సినిమాలుకు ఒకే సమయంలో ఎక్కువ ఇచ్చే అవకాశం లేదు.

అందుకే ఈ సినిమాల విడుదల తేదీల విషయంలో కాస్త మార్పు చేర్పు చేయాలనే ఉద్దేశ్యంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాని సినిమా ముందే విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ముందు వారం రావాలి అంటే ఇప్పటికే వకీల్‌ సాబ్‌ డేట్‌ ఖరారు అయ్యింది.ఇక ఆ తర్వాత రావాలనుకుంటే విరాటపర్వం సిద్దంగా ఉంది.కనుక ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు.కాని రెండు సినిమాలు కాస్త సర్దుబాటు చేసుకోవాలని మాత్రం ఫిక్స్‌ అయ్యారట.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube