టక్ జగదీష్ ఆ వార్తలని నమ్మొద్దంటున్న చిత్రయూనిట్..!

నాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ టక్ జగదీష్. ఏప్రిల్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది.

 Nani Tuck Jagadeesh Makers Clear Rumors On Release Date, Clear, Latest News, Mak-TeluguStop.com

ప్రస్తుతం పరిస్థితి అంతా కంట్రోల్ లోకి రాగా సినిమాల రిలీజ్ లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.అయితే ఈ నెల చివరన నాని టక్ జగదీష్ రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి.

వాటిపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది.టక్ జగదీష్ రిలీజ్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని అనారు.

రిలీజ్ డేట్ ఎప్పుడన్నది తామే స్వయంగా ప్రకటిస్తామని చెప్పారు.

శివ నిర్వాణ షైన్ స్క్రీన్ బ్యానర్ లో నాని ఆల్రెడీ నిన్ను కోరి సినిమా చేశాడు.

ఈ సినిమా వారి కాంబినేషన్ లో వస్తున్న రెండవ సినిమా.హిట్ కాంబో రిపీట్ అవుతుంది కాబట్టీ రిజల్ట్ కూడా అదేలా ఉంటుందని భావిస్తున్నారు.సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు.సినిమాలో జగపతి బాబు పాత్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తుంది.

 ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు.ఇప్పటికే టీజర్ తో సినిమాపై అంచనాలు పెరుగగా సినిమాపై నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube