టక్ వేసుకునేందుకు రెడీ అవుతున్న నాని  

Nani Tuck Jagadeesh - Telugu Nani, Tollywood News, Tuck Jagadeesh, V Movie

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Nani Tuck Jagadeesh

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని తన నెక్ట్స్ మూవీని కూడా ప్రారంభించాడు.

హిట్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాను స్టార్ట్ చేసిన నాని, ఈ సినిమా షూటింగ్‌ను కూడా ఇప్పటికే ప్రారంభించాడు.

టక్ వేసుకునేందుకు రెడీ అవుతున్న నాని-Gossips-Telugu Tollywood Photo Image

అయితే లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలకు పైగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఈ దెబ్బతలో మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు మొదలువుతన్న తరుణంలో నాని కూడా టక్ జగదీష్ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అయ్యాడు.

అయితే విదేశాల్లో జరగాల్సిన షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తి కావడంతో ఇప్పుడు కేవలం సెట్స్‌లోనే జరగాల్సిన షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది.

ఈ అంశం చిత్ర యూనిట్‌కు బాగా కలిసి వచ్చే అంశమని చెప్పాలి.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తోండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test