టక్ జగదీష్‌కు వింత వ్యాధి.. ఏం చేస్తాడో తెలుసా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్‌గా వస్తుండటంతో ఈ సినిమాలో నాని ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Nani Suffers Form Bipolar Disorder In Tuck Jagadeesh Movie, Nani, V Movie,tuck J-TeluguStop.com

కాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా తరువాత నాని తన నెక్ట్స్ మూవీని శివా నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు.

‘టక్ జగదీష్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే తిరిగి తమ షూటింగ్‌ను ప్రారంభించాలని చూస్తోంది.కాగా ఈ సినిమాలో నాని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న పాత్రలో నటిస్తున్నాడట.

బైపోలార్ డిజార్డర్ అనే వ్యాధితో నాని ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తోంది.భాగోద్వేగాలు ఎక్కువైనప్పుడు వింతగా ప్రవర్తించడమే ఈ వ్యాధి లక్షణాలు.

ఇలా తనకు ఎమోషన్స్ ఎక్కువైనప్పుడు నాని ఏం చేస్తాడనేది ఈ సినిమాలో చూపించనున్నారు.

ఇక ఈ పాత్రలో నాని తనలోని నటుడిని మరోసారి మనకు చూపించేందుకు రెడీ అయ్యాడని, ఆయన ఈ పాత్రలో జీవించేస్తున్నాడని చిత్ర యూనిట్ అంటోంది.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు తీర్చిదిద్దుతుండగా, ఈ సినిమాలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube