అక్కని దర్శకురాలిగా పరిచయం చేస్తున్న నాని

నేచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా మంచి నిర్మాతగా మారి తన టేస్ట్ కి తగ్గ సినిమాలని తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.తన బ్యానర్ లో టాలెంటెడ్ దర్శకులని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు.

 Nani To Produce Sister Deepthi Ganta's Directorial Debut, Wall Poster Movies, Me-TeluguStop.com

మొదటి సినిమా “అః” తో ప్రశాంత్ నీల్ ని దర్శకుడుగా పరిచయం చేసిన నని డిఫరెంట్ కాన్సెప్ట్ ని ప్రేక్షకులకి పరిచయం చేశాడు.ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాకుండా విమర్శకుల ప్రశంసలని అందుకుంది.

ఇక రెండో చిత్రంతో శైలేష్ కొలనుని దర్శకుడుగా పరిచయం చేస్తూ విశ్వక్ సేన్ తో హిట్ అనే మూవీని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు.ఇక మూడో సినిమాగా హిట్ సీక్వెల్ ని ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు.

శైలేష్ కొలను దర్శకత్వంలోనే అడవి శేష్ హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది.

Telugu Deepthigantas, Nani, Meet Cute, Tollywood, Wall Poster-Movie

ఇదిలా ఉంటే నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై నాలుగో సినిమాని తాజాగా స్టార్ట్ చేశాడు.విశేషం ఏంటంటే ఈ మూవీతో నాని తన చెల్లి దీప్తి గంటని దర్శకురాలిగా టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు.మీట్ క్యూట్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఓపెనింగ్ తాజాగా జరిగింది.

సత్యరాజ్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రంగా దీనిని ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది.

నాని అక్క దీప్తి రీసెంట్ గా అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిలిం ని తెరకెక్కించింది.ఇక అక్క ప్రతిభని గుర్తించిన నాని తనకి మొదటి సినిమా అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి దర్శకురాలిగా పరిచయం చేస్తున్నాడు.

ఇక ఈ మూవీలో నటించబోయే హీరో, హీరోయిన్స్ ఎవరనే విషయం త్వరలోనే తెలియజేస్తామని నాని క్లారిటీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube