మళ్లీ జెర్సీ వేస్తోన్న నాని.. ఈసారి దేనికో?  

Nani To Join Hands With Jersey Movie Director, Nani, Jersey, Tuck Jagadish, Gautham, Tollywood News - Telugu Gautham, Jersey, Nani, Tollywood News, Tuck Jagadish

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.కానీ ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.

 Nani To Join Hands With Jersey Movie Director

ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే నాని తన నెక్ట్స్ మూవీని శివ నిర్వాణ డైరెక్షన్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.‘టక్ జగదీష్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీగా ‘శ్యామ్ సింగ రాయ్’ను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

మళ్లీ జెర్సీ వేస్తోన్న నాని.. ఈసారి దేనికో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాను రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.గతంలో నానితో జెర్సీ లాంటి సూపర్ హిట్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్, ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నాడు.

ఈ క్రమంలో తన నెక్ట్స్ మూవీని మరోసారి నానితో చేసేందుకు ఈ డైరెక్టర్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

గౌతమ్ నానిని దృష్టిలో పెట్టుకుని ఓ స్టోరీలైన్ చెప్పిన్నట్లు, అది విన్న నాని కూడా వెంటనే కథను డెవలప్ చేయాల్సిందిగా కోరినటలు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2021లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మరి నానికి జెర్సీ లాంటి అదిరిపోయే హిట్ అందించిన ఈ డైరెక్టర్, ఈసారి లాంటి కథతో మెప్పిస్తాడో చూడాలి అంటున్నారు నాని ఫ్యాన్స్.ఏదేమైనా ఈ కాంబో నిజంగానే మరోసారి సెట్ అవుతుందో లేదో చూడాలి.

#Jersey #Gautham #Tuck Jagadish #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nani To Join Hands With Jersey Movie Director Related Telugu News,Photos/Pics,Images..