శైలేష్ డైరక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సినిమా హిట్.2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సీక్వల్ గా హిట్ 2 సెట్స్ మీద ఉంది.విశ్వక్ సేన్ ప్లేస్ లో ఈ సీక్వల్ లో అడివి శేష్ హీరోగా చేస్తున్నాడు.నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని టాక్.
సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో నాని కనిపిస్తాడని అంటున్నారు.పాత్ర చిన్నదే అయినా నాని పాత్ర సినిమాకు చాలా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది.నిర్మాతగా కూడా నాని తన టేస్ట్ ఏంటన్నది చూపిస్తున్నాడు.
అంతకుముందు అ! సినిమా ప్రొడ్యూస్ చేసిన నాని హిట్ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు.
ఇప్పుడు హిట్ 2 సెకండ్ కేస్ కూడా సెట్స్ మీద ఉంది.అయితే హిట్ 2 లో నాని కెమియో రోల్ ఉంటుందని తెలుస్తుంది.
రీసెంట్ గా మేజర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ హిట్ 2తో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు.ఈ సినిమాతో పాటుగా నాని తన సోదరి డైరక్షన్ లో మీట్ క్యూట్ మూవీని నిర్మిస్తున్నారు.
ఆ సినిమాలో నలుగురు కథనాయికలు లీడ్ రోల్ లో నటిస్తున్నారు.