న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్యామ్ సింగ రాయ్.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తుండగా మడోన్నా సెబాస్టియన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.సినిమాకు మిక్కీ జే మేయర్ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నారు.నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.
డిసెంబర్ 24న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో నిర్వహించారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే శ్యామ్ సింగ రాయ్ లో నాని ద్విపాత్రాభినయం చేసినట్టు అర్ధమవుతుంది.
కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాను రాహుల్ సంకృత్యన్ క్రేజీగా రూపొందించారని అనిపిస్తుంది.ట్రైలర్ గ్రిప్పింగ్ గా ఉంది.
ఇంప్రెసివ్ ట్రైలర్ తో నాని శ్యామ్ సింగ రాయ్ తో తన ఖాతాలో హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు.సినిమాలో నాని రెండు పాత్రల్లో కొత్తగా కనిపిస్తాడని మాత్రం అర్ధమవుతుంది.
వి, టక్ జగదీష్ సినిమాల విషయంలో నిరాశపరచిన నాని ఈసారి శ్యామ్ సింగ రాయ్ తో పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడు.