శ్యామ్ సింగ రాయ్ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న క్రేజీ సినిమా శ్యామ్ సింగ రాయ్.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.సినిమాలో నాని కూడా డ్యుయల్ రోల్ లో అలరించనున్నాడు.సినిమా నుండి ఇప్పటికే వచ్చిన టైటిల్ సాంగ్ అంచనాలు పెంచగా ఇక లేటెస్ట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమా నుండి త్వరలో టీజర్ కూడా రాబోతుందని తెలుస్తుంది.

 Nani Shyam Singha Roy Teaser Release Date Locked , Nani , Nani Shyam Singh Roy T-TeluguStop.com

శ్యామ్ సింగ రాయ్ టీజర్ డేట్ రివీల్ చేశారు.నవంబర్ 18న శ్యామ్ సింగ రాయ్ టీజర్ రిలీజ్ చేస్తున్నారని ప్రకటించారు.

కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలో నాని కెరియర్ లో ఇదివరకు ఎప్పుడూ చేయని డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తుంది.V, టక్ జగదీష్ సినిమాల ఫలితాలతో నిరాశ పరచిన నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మాత్రం ఆడియెన్స్ అంచనాలను అందుకుంటారని అంటున్నారు.

డిసెంబర్ 24న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు ఇప్పటినుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని.సినిమాకు మిక్కి జే మేయర్ ఇచ్చే మ్యూజిక్ కూడా హైలెట్ గా ఉంటుందని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube