మరోసారి ఇంట్రెస్టింగ్ లైన్ తో రాబోతున్న నాని..ఈసారి హిట్టు పక్కా!

Nani Shyam Singha Roy Movie Interesting Updates

న్యాచులర్ స్టార్ నాని చేస్తున్న సినిమాల్లో శ్యామ్ సింగ రాయ్ ఒకటి.రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

 Nani Shyam Singha Roy Movie Interesting Updates-TeluguStop.com

ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ మధ్యనే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని, అంచనాలను పెంచేసాయి.

 Nani Shyam Singha Roy Movie Interesting Updates-మరోసారి ఇంట్రెస్టింగ్ లైన్ తో రాబోతున్న నాని..ఈసారి హిట్టు పక్కా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.

నాని ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారని ఇప్పటికే అర్ధం అయ్యింది.బెంగాలీ వ్యక్తిగా అలానే మోడ్రన్ యువకుడిగా కూడా నాని కనిపించనున్నాడు.

టీజర్ లో నాని, సాయి పల్లవి కలకత్తాలో నివసించే బెంగాలీ జంటగా కనిపించారు.ఇందులో సాయి పల్లవి దేవదాసీగా, నాని జర్నలిస్ట్ గా కనిపించ బోతున్నారు.

నాని నటించే రెండు పాత్రల కథనాలు కొత్తగా ఉంటాయని తెలుస్తోంది.శ్యామ్ సింగరాయ్ రచయితగా రాసే కథల్లో ఉండే పాత్రలోకి వెళ్లిపోయే క్యారెక్టర్ అని ప్రచారం జరుగుతుంది.

Telugu Kriti Shetty, Nani, Nanishyam, Sai Pallavi, Shyamsingha-Movie

ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.దీన్ని బట్టి చూస్తే ఈసారి కూడా నాని ఒక కొత్త లైన్ తో మన ముందుకు రాబోతున్నాడని అర్ధం అవుతుంది.

Telugu Kriti Shetty, Nani, Nanishyam, Sai Pallavi, Shyamsingha-Movie

దేవదాసీ సంప్రదాయాన్ని వ్యతిరేకించే వ్యక్తులుగా హీరో హీరోయిన్స్ కనిపించ బోతున్నారని సమాచారం.కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.సత్య దేవ్ జంగా ఈ సినిమాకు కథ అందించారు.మరి చూడాలి ఈ సినిమా అయినా నాని కి సూపర్ హిట్ ఇస్తుందో లేదో.

#Kriti Shetty #ShyamSingha #Nani #NaniShyam #ShyamSingha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube