నానిలోని మరొక కోణాన్ని ఆవిష్కరించబోతున్న శ్యామ్ సింగరాయ్!

టాలీవుడ్ న్యాచులర్ స్టార్ నాని ఎప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అభిమానులకు కొత్తదనాన్ని పంచుతాడు.ఇక ఇప్పుడు నాని నటిస్తున్న సినిమాల్లో శ్యామ్ సింగరాయ్ సినిమా ఒకటి.

 Nani Shyam Singha Roy Latest Update Today Evening Revealing, Nani, Shyam Singha-TeluguStop.com

రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి మేకర్స్ అనౌన్స్ చేసారు.ఈ సినిమా నుండి ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో నాని లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండి ప్రేక్షకులను అలరించింది.

నాని ప్రతి సినిమాకు తనదైన నటన కనబరుస్తూ ప్రేక్షకులను అలరిస్తాడు కాబట్టి నానిని న్యాచురల్ స్టార్ అనే బిరుదుని ఇచ్చారు ప్రేక్షకులు.ఇక ఈ సినిమాలో కూడా నాని మరొక కోణాన్ని చూడబోతున్నారని దర్శకుడు తెలిపాడు.

రాహుల్ సంక్రిత్యాన్‌ పోస్ట్ చేస్తూ.”విప్లవం నుండి వచ్చిన మార్పును శ్యామ్ సింగరాయ్ లోని మరొక కోణాన్ని చూసేందుకు ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు సిద్ధంగా ఉండండి” అంటూ పోస్ట్ చేసారు.

ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందో అని చెప్పడంతో అభిమానులు ఆశగా ఎదురు చుస్తున్నారు.నాని లోని మరొక డిఫరెంట్ డైమెన్షన్ ను ఈ రోజు చూపించ బోతున్నారు.

ఈ సినిమాలో నాని రివల్యూషన్ నుండి మార్పు చెందిన వ్యక్తిగా కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఇక ఈ రోజు విడుదల అయ్యే అప్డేట్ కోసం అందరిలో ఆసక్తి నెలకొంది.ఇక ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తుందనగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube