'శ్యామ్ సింగరాయ్' విషయంలో పరిధి దాటుతున్న బడ్జెట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచులర్ స్టార్ అని పేరు సంపాదించుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్ అందుకున్నాడు నాని.విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మినిమం గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.

 Nani Shyam Singha Roy Crossed Budget Limit-TeluguStop.com

స్టార్ హీరోలు కూడా చేయనంత ఫాస్ట్ గా సంవత్సరానికి 4 సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఈయన సినిమా రాబోతుందంటే ఏదో కొత్తదనం ఆశిస్తారు ఆడియన్స్.

ప్రస్తుతం నాని టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు.నాని కెరీర్ లో 26 వ సినిమాగా టక్ జగదీష్ తెరకెక్కింది.ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నిన్ను కోరి సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

 Nani Shyam Singha Roy Crossed Budget Limit-శ్యామ్ సింగరాయ్’ విషయంలో పరిధి దాటుతున్న బడ్జెట్..-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

Telugu Budjet, Krithi Shetty, Nani, Nani Shyam Singha Roy Crossed Budget Limit, Rahul Sankrityan, Sai Pallavi, Shyam Singha Roy-Latest News - Telugu

ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 23 న విడుదల అవ్వబోతుంది.ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే మరొక సినిమా స్టార్ట్ చేసాడు నాని.రాహుల్ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ఫస్ట్ లుక్ అభిమానులకు బాగా ఆకట్టుకుంది.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.అయితే ఈ సినిమా బడ్జెట్ రోజురోజుకూ పెరుగుతుందని టాక్ నడుస్తుంది.

నాని సినిమా సూపర్ హిట్ అయితే 30 నుండి 35 కోట్ల వరకు వసూలు చేస్తుంది.కరోనా కారణంగా షూటింగ్ మొత్తం సెట్స్ లోనే జరగడం వల్ల నాని మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారట.

ఇప్పుడు ఈ విషయంపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది.చూడాలి మరి ఈ సినిమా చివరకు ఎంత బడ్జెట్ దగ్గర ఆగుతుందో.

#NaniShyam #Sai Pallavi #Nani #Krithi Shetty #Budjet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు