నాని శ్యామ్ సింగరాయ్‌ విడుదల తేదీ..!

నాని వరుసగా రెండు సినిమాలు వి మరియు టక్ జగదీష్‌ లు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి.సినిమా లు రెండు కూడా నిరాశ పర్చాయి.

 Nani Shyam Singa Rai Movie Release Date-TeluguStop.com

నాని కథల ఎంపిక విషయంలో విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో నాని తదుపరి సినిమా శ్యామ్‌ సిగరాయ్ గురించిన చర్చలు జరుగుతున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న శ్యామ్‌ సిగరాయ్ కు ట్యాక్సీ వాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్ దర్శకత్వం వహించాడు.భారీ అంచనాలున్న ఈ సినిమా చిత్రీకరణ ముగిసినట్లుగా యూనిట్‌ సభ్యులు ఇప్పటికే ప్రకటించాడు.

 Nani Shyam Singa Rai Movie Release Date-నాని శ్యామ్ సింగరాయ్‌ విడుదల తేదీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాని కూడా చివరి రోజు షూటింగ్ అంటూ ఒక ఫొటోను షేర్ చేసి చాలా రోజులు అయ్యింది.కనుక సినిమా విడుదల ఎప్పుడు అంటూ అంతా కూడా ప్రశ్నిస్తున్నారు.

నాని శ్యామ్‌ సింగరాయ్ విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నెల చివర్లో విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వబోతున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ చివరి వారం లో లేదా నవంబర్ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న నాని శ్యామ్ సింగరాయ్ సినిమా లో నాని లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది.

Telugu Director Rahul Sankeerthyan, Movie News, Nani, Nani Big Budget Movie, October Or November, Shaym Singa Rai, Shyam Singha Roy Release Date, Tollywood, Tuck Jagadish, V Movie-Movie

చాలా యూనిక్ గా ఉండటంతో పాటు పూర్వ జన్మల కథ అవ్వడం వల్ల ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.కోల్‌ కత్తా సెట్‌ ను హైదరాబాద్‌ లో భారీగా వేసి చిత్రీకరించారు.పెద్ద ఎత్తున ఈ సినిమా కోసం ఖర్చు చేశారు.నాని కెరీర్ లో బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ సినిమా అంటున్నారు.కనుక ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.అందుకే నవంబర్‌ లో పోటీ లేని సమయంలో అంటే మొదటి వారం విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారట.

వారం లేదా పది రోజుల్లో ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వబోతున్నారు.

#Shaym Singa Rai #OctoberOr #NaniBig #Tuck Jagadish #ShyamSingha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు