నాని ఇన్నేళ్ల సినీ కెరీర్‌ లో ఇది చాలా ప్రత్యేకం

నాచురల్‌ స్టార్ నాని కెరీర్‌ చాలా స్మూత్‌ గా సాఫీగా సాగిపోతుంది.ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్నా.

 Nani Shyam Singa Rai Movie Record Budget , Natural Star Nani, Shyam Singarai, Di-TeluguStop.com

లేదంటే నిరాశ పర్చినా కూడా కూల్‌ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.అలాంటి నాని తన సినిమాల బడ్జెట్‌ విషయంలో ఎప్పుడు కూడా దర్శకులకు కండీషన్స్‌ పెడుతూ ఉంటాడు.

నిర్మాతలను దృష్టి లో పెట్టుకుని సినిమా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించడంలో నాని తర్వాతే ఎవరైనా అంటూ ఉంటారు.నాని కెరీర్‌ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు మూడు పదుల కోట్ల బడ్జెట్‌ దాటింది లేదని అంటూ ఉంటారు.

ఈగ సినిమాను తప్పించి ఏ ఒక్క సినిమా బడ్జెట్‌ కూడా వామ్మో అన్నట్లుగా ఉండదు.అయితే నాని ఆ మార్క్‌ ను చెరిపేయబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

నాని ప్రస్తుతం చేస్తున్న శ్యామ్‌ సింగరాయ్ సినిమాకు ఏకంగా 40 నుండి 50 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు అంటున్నారు.

Telugu Double Role, Nani, Natural Nani, Rahul Nani, Shyam Singarai, Syam Singa R

ఇంత బడ్జెట్ అవ్వడంతో ముందు ఒక నిర్మాణ సంస్థ నిర్మించేందుకు సిద్దం అయ్యింది.కాని మద్యలో చేతులు ఎత్తేసింది.దాంతో నాని మరో నిర్మాతను పట్టాడు.

దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్ మరియు కథపై నమ్మకంతో నాని ఇంత బడ్జెట్‌ అయినా వర్కౌట్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా ఉన్నాడట.త్వరలోనే ఈ సినిమా కీలక అప్‌ డేట్‌ రాబోతుంది.

ఈ సినిమా మొత్తం కూడా ఒక విభిన్నమైన లొకేషన్‌ లో షూటింగ్ జరుగుతుందని అంటున్నారు.అందుకోసమే భారీ గా ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

సెట్టింగ్స్ పరంగా నాని కొత్త రికార్డును సృష్టిస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.ఇక హీరోయిన్స్ కూడా ఈ సినిమాలో ముగ్గురు ఉండబోతున్నారు.

ఇప్పటి వరకు నాని చేయని పాత్రను చేయబోతున్నాడు.ఇక డబుల్‌ రోల్‌ లో నాని కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి నాని తన సినీ కెరీర్ లోనే మొదటి సారి ఆ మార్క్‌ ను చెరిపేసి కొత్త రికార్డును నమోదు చేయబోతున్నాడు.ఈ సినిమా సక్సెస్‌ అయ్యి నిర్మాతలకు లాభాలు కురిస్తే నాని రేంజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube