మరింత భారంగా మారుతున్న నాని శ్యామ్‌ సింగరాయ్‌

నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా శ్యామ్ సింగ రాయ్‌.ఈ సినిమా బడ్జెట్‌ భారీగా ఉండటంతో మొదట ఒక నిర్మాణ సంస్థ మొదలు పెట్టి వదిలేసింది.

 Nani Shyam Singa Rai Movie Budget Issue , Film News , Nani , New Film , Shyam Si-TeluguStop.com

నానితో అంత బడ్జెట్‌ వర్కౌట్‌ అయ్యేనా ఈ దర్శకుడు అంత బడ్జెట్ ను రికవరీ చేయగలడా అంటూ వారు అనుమానాలు వ్యక్తం చేసి ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు అంటూ ఆ మద్య వార్తలు వచ్చాయి.ప్రస్తుతం ఈ సినిమా ను నిహారిక ఎంటర్‌ టైన్ మెంట్స్ బ్యానర్ లో వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో మొదటి నుండి చర్చ జరుగుతూనే ఉంది.కరోనా కారణంగా షూటింగ్‌ ఆగుతూ సాగుతూ వస్తుంది.

దాంతో బడ్జెట్‌ దాదాపుగా పది కోట్లు పెరిగి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరో వైపు ఈ సినిమా కోసం వేసిన దాదాపు ఆరు కోట్ల సెట్‌ వర్షార్పనం అయ్యింది.

ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఈ సినిమా సెట్ట్‌ సగానికి పైగా స్వంసం అయ్యిందట.దాంతో మరో మూడు నాలుగు కోట్లు పెట్టి ఆ సెట్టింగ్‌ ను వేయించాల్సి రావచ్చు అంటున్నారు.

దాంతో ఈ సినిమా బడ్జెట్ మరీ అధికంగా మారుతుందని అంటున్నారు.పెద్ద ఎత్తున ఈ సినిమా బడ్జెట్ అవుతున్న నేపథ్యంలో బిజినెస్ ఎలా ఉంటుందో అనే ఆందోళన కొందరిని వేదిస్తుంది.

నాని కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ అంటే 50 కోట్లు.అంతకు మించి అంటే ఈ సినిమా అద్బుతమైన అయ్యి ఉండాలి లేదంటే లక్‌ అయినా కలిసి రావాలి.

ప్రయోగాత్మకంగా నాని చేస్తున్న ఈ సినిమా కమర్షియల్‌ గా ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తి గా చూస్తున్నారు.నాని కి ఇది చాలా ప్రతిష్టాత్మకం.గత ఏడాది ఈయన నటించిన వి సినిమా నిరాశ పర్చింది.అందుకే ఈ సినిమా తో మళ్లీ ఫుల్‌ స్వింగ్‌ లోకి రావాలని నాని ఆశ పడుతున్నాడు.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube