ఆచార్య సినిమాపై నాని షాకింగ్ కామెంట్స్.. ఏం అన్నారంటే?

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని గురించి అందరికి తెలిసిందే.తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు.

 Nani Shocking Comments On Acharya Movie What Do You Mean-TeluguStop.com

అష్టా చమ్మా సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన నాని ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకొని వరుస సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఆచార్య సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేశాడు నాని.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా గురించి అందరికి తెలిసిందే.ఇందులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించగా ఈ సినిమా నక్సలైట్ నేపథ్యంలో తెరకెక్కనుంది.

 Nani Shocking Comments On Acharya Movie What Do You Mean-ఆచార్య సినిమాపై నాని షాకింగ్ కామెంట్స్.. ఏం అన్నారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే కోవిడ్ ప్రభావం సినీ ఇండస్ట్రీ పై పడటంతో భారీగా నష్టాన్ని ఎదుర్కొంది.ఇక మళ్లీ థియేటర్లు తెరుచుకోగా మళ్లీ వరుసగా కొన్ని సినిమాలు విడుదలయ్యాయి.

దాంతో మంచి లాభాలు కూడా వచ్చాయి.కానీ సెకండ్ వేవ్ మళ్లీ ప్రభావం ఎక్కువగా పడటంతో ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవో బాగా ఇబ్బందిగా మారింది.

కొన్ని రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ఒక జీవో అమలు చేసింది.వకీల్ సాబ్ సినిమా సమయంలో ఈ నిర్ణయం తీసుకోగా ఈ సినిమాకు కొంత నష్టం కూడా ఎదురయింది.సినిమా గంట ముందు బెనిఫిట్ షో లు రద్దు చేస్తున్నట్లు తెలియజేయగా దీని వల్ల భారీ నష్టం కలిగింది.అలా టిక్కెట్ల రేట్ల ప్రభావంతో సినిమా థియేటర్లు మూసివేశారు.

కానీ ఈ సినిమా టికెట్స్ రేట్లపై ఎవరు కూడా స్పందించలేదు.

కానీ ఇటీవలే హీరో నాని ఇష్క్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొని ఈ టికెట్ల రేట్ల గురించి స్పందించాడు.సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, దీని తొక్కాలని చూడటం ఏమాత్రం బాగాలేదని తెలిపాడు.ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల గురించి దృష్టి పెట్టడం మానేసి సినిమా థియేటర్లపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్నించాడు.

మీరు పెట్టిన టికెట్ ధర వల్ల సినిమాలన్నీ ఓటీటీ కి పరిమితమవుతున్నాయని తెలిపారు.దీనివల్ల థియేటర్లు మూతపడడంతో మేమందరం నష్టపోతున్నామని ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా కూడా ఓటీటీ లోనే విడుదల అయిందని అన్నాడు.

ఇక చిరంజీవి ఆచార్య సినిమా, ఆర్ఆర్ఆర్ సినిమాలు కూడా ఓటీటీ లో విడుదలయ్యే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పోరాడతాను అని అన్నాడు నాని.

#Theaters #Ppa #Nani #Acharya #Acarya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు