అంచనాలను తల కిందులు చేసేసిన జగదీష్‌.. శివ నిర్వాన కొత్త ప్రయత్నం సక్సెస్‌ అయ్యేనా

నేడు నాని పుట్టిన రోజు సందర్బంగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన సినిమాలకు సంబంధించిన క్లిప్లింగ్‌ లు కొత్తగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ లు కనిపిస్తున్నాయి.ఇప్పటికే షూటింగ్‌ ను ముగించుకున్న టక్‌ జగదీష్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Nani Shiva Nirvana Movie Tuck Jagadish Trailer Movie News ,tolywood ,tuck Gadesh-TeluguStop.com

ఆ సినిమా షూటింగ్‌ ముగిసిన నేపథ్యంలో సినిమా ట్రైలర్‌ ను నేడు నాని పుట్టిన రోజు సందర్బంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ట్రైలర్‌ లో ఈ సినిమా థీమ్ ఏంటీ అనే విషయాన్ని క్లీయర్‌ గా దర్శకుడు శివ నిర్వాణ చూపించాడు.

ఈ సినిమా కు ముందు నాని మరియు శివ నిర్వానల కాంబోలో నిన్ను కోరి సినిమా వచ్చిన విషయం తెల్సిందే.అది ఒక మెచ్యూర్డ్‌ లవ్ స్టోరీగా రూపొందింది.

ఇప్పుడు అంతుకు మించి వైవిధ్యభరితంగా సినిమాను టక్‌ జగదీష్‌ రూపంలో చేసినట్లుగా ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.మరో సారి ఒక మెచ్యూర్డ్‌ లవ్ స్టోరీతో ఈ సినిమా ఉంటుందని అంతా భావించారు.

కాని అన్ని అంచనాలు తల కిందులు అయ్యేలా ఈ సినిమా ఉండబోతుంది అంటూ ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది.

శివ నిర్వాన ఇప్పటి వరకు చేసిన సినిమాలు అన్ని కూడా లవ్‌ స్టోరీ తో రూపొందినవే.

ముఖ్యంగా మజిలీ సినిమా వంటి వైవిధ్యభరిత కథతో ఈయన సినిమాను చేస్తూ ఉంటాడని టక్ జగదీష్ సినిమా పై అంచనాలు పెట్టుకుని ఉన్నాడు.ఇలాంటి సమయంలో శివ నిర్వాన తన టక్ జగదీష్‌ సినిమాతో ప్రయోగం చేస్తున్నట్లుగ ట్రైలర్ ను బట్టి అర్థం అవుతుంది.

పెద్ద ఎత్తున ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని అనిపిస్తుంది.నాని గతంలో ఎప్పుడు కనిపించని విధంగా చాలా ఫార్మల్‌ గా మరియు మాస్ గాకనిపించబోతున్నాడు.

తన సినిమాలతో ఇప్పటి వరకు కేవలం మాస్ ను మాత్రమే ఆకట్టుకున్న శివ నిర్వాన ఈ సారి మాస్ ను కూడా మెప్పించడం ఖాయంగా అనిపిస్తుంది.ఇది కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో యూనిట్‌ సభ్యులు ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube