ఇంద్రగంటి మల్టీస్టారర్‌కు హీరోలు దొరికేశారు.. సక్సెస్‌ గ్యారెంటీ     2018-07-15   10:47:42  IST  Ramesh Palla

విభిన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తాజాగా ఈయన సుధీర్‌బాబుకు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌ను ‘సమ్మోహనం’ రూపంలో ఇవ్వడం జరిగింది. పెద్దగా అంచనాలు లేకుండా తెరకెక్కి, విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 10 కోట్లకు పైగా షేర్‌ను దక్కించుకున్న దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన తదుపరి చిత్రాన్ని దిల్‌రాజు బ్యానర్‌లో చేసేందుకు సిద్దం అయ్యాడు. వీరిద్దరి కాంబోలో చాలా రోజుల క్రితమే సినిమా రావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

ఎట్టకేలకు సమ్మోహనం చిత్రం సక్సెస్‌ కావడంతో దిల్‌రాజు వెంటనే ఇంద్రగంటితో సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్‌రాజు వద్దకు దర్శకుడు ఇంద్రగంటి మరో మల్టీస్టారర్‌ స్క్రిప్ట్‌ను తీసుకు రావడం జరిగింది. కథ నచ్చడంతో వెంటనే ఈ మల్టీస్టారర్‌ను కూడా నిర్మించేందుకు దిల్‌రాజు కమిట్‌ అయ్యాడు. ఇటీవలే దిల్‌రాజు ఆఫీస్‌ నుండి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ మల్టీస్టారర్‌లో హీరోు ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. తాజాగా సినీ వర్గాల్లో ఈ మల్టీస్టారర్‌లో శర్వానంద్‌ మరియు నానిలు హీరోలుగా నటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

Nani Sharwanand In Indraganti Mohan Krishna Multi Starrer-

Nani Sharwanand In Indraganti Mohan Krishna Multi Starrer

నానిని హీరోగా పరిచయం చేసింది మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆ అభిమానంతోనే ఇటీవలే ‘జెంటిల్‌మన్‌’ చిత్రాన్ని ఇంద్రగంటి దర్శకత్వంలో నాని చేసిన విషయం తెల్సిందే. ఆ చిత్రం కూడా నానికి మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. అందుకే మరోసారి ఇంద్రగంటి దర్శకత్వంలో నటించాలని నాని భావించాడు. మరో వైపు శర్వానంద్‌కు కూడా చాలా కాలంగా ఇంద్రగంటి దర్శకత్వంలో చేయాలనే కోరిక ఉంది. మంచి కథ కోసం వెయిట్‌ చేసిన శర్వా తాజాగా ఇంద్రగంటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. నాని మరియు శర్వానంద్‌లు కలిసి చేయబోతున్న ఈ చిత్రం తప్పకుండా టాలీవుడ్‌లో ఒక ట్రెండ్‌ సెట్టింగ్‌ మూవీ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

ఇద్దరు యువ హీరోలు, అది కూడా హోరా హోరీగా పోటీ ఉన్న హీరోలు కలిసి నటించడం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఈ మల్టీస్టారర్‌ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని దాదాపుగా 40 కోట్ల బడ్జెట్‌తో తెరెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. 2019 చివర్లో సినిమా వస్తుందని దిల్‌రాజు ఆఫీస్‌ వర్గాలు చెబుతున్నాయి.